రామ్‌ చరణ్‌తో ఫన్నీగా మాట్లాడిన కేటీఆర్..!

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

అవునా ఇదేంటి.. ఈ ఇద్దరి మధ్య ఏం టాఫిక్ వచ్చిందబ్బా..? అని అనుకుంటున్నారా..? మీరు వింటున్నది నిజమే.. కానీ ఇక్కడ సినిమాలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదండోయ్.. రియల్ లైఫ్‌లో ఓ వ్యక్తితో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫన్నీగా మాట్లాడారు. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది..? ఇంతకీ ఇదంతా సోషల్ మీడియాలోనా..? లేకుంటో మరోచోట ఎక్కడైనా జరిగిందా..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజల్లోకి ప్రతినిధులు!

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో ప్రస్తుతం యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలయితే.. లాక్ డౌన్‌‌ను యమా సీరియస్‌గా తీసుకున్నాయ్. లక్ష్మణ రేఖ (ఇల్లు) దాటితే పోలీసులు లాఠీలకు బుద్ధి చెబుతున్నారు. అదీ పరిస్థితి. ఈ క్రమంలో ఏ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వారి సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరకులు, ఇంకా మాస్క్‌లు, శానిటైజర్లు పంచుతూ.. నిత్యం వారికి టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలతో ముచ్చటించి ఈ కరోనా నేపథ్యంలో ఎలా ఉండాలి..? అని సలహాలు, సూచనలిస్తూ వెళ్తున్నారు. అంటే సోషల్ మీడియాలోనే కాదు.. ఇలా జనాలకు దగ్గరవుతున్నారన్న మాట.

అందరూ బాగున్నారా..!

ఈ క్రమంలో ఓ ఇంటి దగ్గరికెళ్లిన కేటీఆర్.. ఓ కుటుంబ సభ్యులను లాక్‌డౌన్ కష్టాల గురించి అడిగి తెలుసుకుంటుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ‘అందరూ మంచిగున్నారా..? మీకెవరికీ ఏమీకాదు.. మూతికి బట్టకట్టుకోవాలా.. వచ్చే నెల-03 తారీఖు దాక బయటకెళ్లొద్దు. ఆ తర్వాత ఏమైతాదో చెబుతాం.. మీకెవరికి ఏమీ కాదు.. పిల్లలు ఇంట్లకెళ్లి కదులుతున్నారా.. అటు ఇటు.. బయటకు పోనియొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలా మీకు తోడుగా ఉంటుంది.. మీకేం కావాలన్నా సర్కార్ చూసుకుంటుంది’ అని కేటీఆర్ అభయమిచ్చారు.

ఇదీ ఆ ఫన్నీ కథ..!?

అక్కడున్న మహిళలతో మాట్లాడిన అనంతరం.. ఓ బాలుడి గురించి ‘అమ్మా మీ కొడుకా? ఏం పేరు..’ అని కేటీఆర్ ప్రశ్నించాడు. ఆ పిల్లాడు.. ‘ నా పేరు రామ్ చరణ్ సార్’ అని బదులిచ్చాడు. మళ్లీ కేటీఆర్ మాట్లాడుతూ.. ‘అవునా ఆ రామ్ చరణ్ తెలుసా నీకు..’ అని అడగ్గా.. ‘హా తెలుసు సార్.. సినిమాలా రామ్ చరణ్ ’ అని ఆ పిల్లాడు సమాధనమిచ్చాడు. ఇలా ఈ ఇద్దరి మాటలున్న వీడియోను చూసిన జనాలు తెగ నవ్వుకుంటున్నారు. చెర్రీ పేరును ప్రస్తావిస్తూ... కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా హీరో రామ్ చరణ్.. కేటీఆర్ మంచి మిత్రులు.. చెర్రీ సినిమా ఫంక్షన్‌కు కూడా పలుమార్లు మంత్రి కేటీఆర్ వచ్చారు.

కామెంట్సే కామెంట్స్..

‘లీడర్ అంటే మీలా వుండాలి కేటీఆర్ అన్నా.. మీరు ఎప్పుడు ప్రజలలో ప్రజలతో కలసి వుంటారు’.. ‘నిజమైన మనసున్న నాయకులు కేటీఆర్ గారు... స్నేహితుల గొప్పతనం చాటుకున్నారు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. ‘మీరు నిజంగా సూపర్ సర్...ఆంధ్ర లో మీలాంటి వాళ్ళు లేకపోవడం మేము చాలా భాద పడుతున్నాము...నిజంగా మీరు ఇక్కడ ఆంధ్రలో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు...ఒక ఆంధ్రవాడిగా చెబుతున్నా మీరు నిజమైన ప్రాజానాయకులు...జై హింద్’ అని కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.