ప్రియాంక హత్య కేసు: రంగంలోకి దిగిన కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డిని కొందరు మానవమృగాలు అత్యాచారం చేసి ఆపై.. సజీవ దహనం చేసి దారుణంగా హత్యచేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనతో జనాలు ఉలిక్కిపడుతున్నారు. ఎప్పుడు.. ఎక్కడేం జరుగుతుందో అని ఇంటి నుంచి బయటికి పిల్లలను పంపాలంటేనే తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రియాంకరెడ్డి హత్యపై తాజాగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కేటీఆర్ రంగంలోకి దిగారు.
మొత్తం నేనే చూసుకుంటా..!
‘ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన కేసును నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. ఈ దారుణ ఘటన కేసులో నిందితులను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసముంది. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుంది. ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 100 నంబరుకి ఫోన్ చేసి సాయం కోరవచ్చు’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ ట్వీట్‌కు పలువురు పాజిటివ్‌గా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పుడే నిద్రలేచారా సార్ అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments