KCRకు కొత్త అర్థం చెప్పిన KTR!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ నీటి పారుదల రంగంలో మరో అపురూప ఘట్టం చోటుచేసుకున్న విషయం విదితమే. గోదావరి జలాలు సముద్ర మట్టానికి 530 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మర్కుక్ పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామితో కలిసి మోటార్లు ప్రారంభించగా, పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోతల విధానంలో జలజలా ముందుకు ఉరికాయి. ఇలా కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్థి పథంలో దూసుకుపోతోందని ఆ పార్టీ నేతలు, మంత్రులు చెబుతున్నారు. అయితే ఎవరికి వారు కేసీఆర్ను మంత్రులు పొగడ్తలతో ముంచెత్తగా.. ఆయన కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం.. తన తండ్రి పేరు KCR అంటే కొత్త అర్థం చెప్పారు.
KCR లో :-
K అంటే కాల్వలు
C అంటే చెరువులు
R అంటే రిజర్వాయర్లు అని అర్థమని ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంప్ చేయడానికి కేసీఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేశారని.. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఇవాళ ఓపెన్ చేసిన ఈ ప్రాజెక్టు వల్ల 2.85 ఎకరాల సాగు భూమికి నీరు అందుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com