కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితితో ఇరు రాష్ట్రాల ప్రజల భయపడిపోయారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆదివారం పూట తియ్యటి శుభవార్త ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అదేమిటంటే.. తెలంగాణ 11 కరోనా పాజిటివ్ వచ్చిన వారు కోలుకున్నారని స్పష్టం చేశారు. వీరికి ఇదివరకే పలుమార్లు టెస్ట్‌లు చేయగా ఆ 11 మందికి నెగిటివ్ అని వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం, వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు.

ట్వీట్‌లో ఏముంది..!?

‘మీ అందరితో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. తెలంగాణలో గతంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 11 మందికి తాజాగా ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ఇప్పటి వరకూ తెలంగాణలో 67 కరోనా పాజిటివ్ కేసులు రాగా.. ఒకరు మృతి చెందారు. ఈ రిపోర్టులకు చెందిన వార్తలను తెలంగాణ వాసులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

More News

అస‌లు త‌గ్గ‌నంటోన్న నిధి అగ‌ర్వాల్‌

గ్లామ‌ర్ డాల్ నిధి అగ‌ర్వాల్‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. ఇక త‌మిళంలో గ‌త ఏడాది ఓ సినిమాలో మాత్రం న‌టించింది. అయినా కూడా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అస‌లు త‌గ్గ‌నంటోంద‌ట ఈ బ్యూటీ.

'మోస‌గాళ్ళు' క‌థ ఇదేనా?

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్ళు’. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు

'వ‌కీల్‌సాబ్‌' వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ మూవీ పింక్‌కు ఇది రీమేక్‌. దిల్‌రాజు

పెళ్లి వాయిదా...పుట్టిన‌రోజు వేడుక‌లు వ‌ద్దు: నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అలాగే ఈ నెల 30న కూడా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమానులెవ‌రూ నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని కోరుతూ ఓ లేఖ రాశారు.

క‌రోనా నివార‌ణకు అత్యవ‌ర‌స‌మైన ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన నిఖిల్ సిద్ధార్థ‌

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.