KTR: హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టిపెట్టడం కాదు.. వాటర్ ట్యాప్‌లపై దృష్టిపెట్టాలని సూచించారు. ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరో హీరోయిన్లను బెదిరించానని తనపై ఓ మంత్రి విమర్శలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు భయపడే వ్యక్తిని కాదని.. ఇలాగే అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తే ఎవర్నీ వదిలిపెట్టాం తాట తీస్తాం అంటూ హెచ్చరించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించిందని ఆరోపించారు. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అని.. 2023 ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే రాష్ట్రంలోని పల్లెల్లో సాగునీరు, పట్టణాల్లో తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ప్రతి పట్టణంలో బిందెలతో ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాల గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆ వివరాలు అన్నీ పంపిస్తామని తెలిపారు.
రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలని సూచించారు. ధన వనరులను ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ద జల వనరులను తెలంగాణకు తేవడంలో లేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎలా ఓడగొట్టాలి.. ఎలా బెదిరించాలి.. ఢిల్లీకి డబ్బు సూట్ కేసులు ఎలా తరలించాలనే ధ్యాస తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ ముఖ్యమంత్రికి ఆలోచన లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి.. మళ్లీ వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ వెల్లడించారు.
కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశామని అరెస్ట్ అయిన అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసు గులాబీ నేతల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆయా నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారు. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని.. త్వరలోనే అందరికి చట్టప్రకారం శిక్ష పడటం ఖాయమని స్పష్టంచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments