నిర్మాత ట్వీట్‌కు కెటీఆర్ రిప్లై
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ ప్రభావంతో దేశం స్తంభిస్తే.. పేదలు, మధ్య తరగతివారు అట్టుకుడికిపోతున్నారు. ఢిల్లీ వంటి కేంద్ర రాజధానిలో కార్మికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఓ వలస కూలీ గర్బిణి అయిన భార్యతో కలిసి 100 కి.మీ నడవటం అందరినీ కంటతడి పెట్టించింది. అందరూ ప్రభుత్వాలను తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఆదుకుంటామని చెబుతూ ప్రతి ఒక్కరికీ రూ.500.. 12 కిలోల బియ్యం లేదా గోధుమ పిండి ఇస్తామని ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయనలా ఇతర ముఖ్యమంత్రులు ప్రజలకు భరోసాను కల్పించలేపోయారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్వీట్ చేసి కేసీఆర్‌ను ప్రశంసించారు. కరోనా ప్రజలను ఇబ్బంది పెడుతుంటే వారిని ఆదుకోవడానికి కేసీఆర్ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ మంచి చేస్తున్నారని, కానీ జాతీయ మీడియా పట్టించుకోవడం లేదెందుకు? అంటూ ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కేటీజర్ను జత చేశారు. అయితే శోభు యార్లగడ్డ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. జాతీయ మీడియా అంటే ఢిల్లీకే పరిమితం కాకూడదు. పరిధిని మించి చూసినప్పుడే అది జాతీయ మీడియా అన్నారు కేటీఆర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout