కేటీఆర్ రియల్ హీరో.. సోనూసూద్ సూపర్ హీరో!
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ వేదికగా ముచ్చటించుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సోనూసూద్‌ను కేటీఆర్ సూపర్ హీరో అయంతే.. కేటీఆర్ రియల్ హీరో అంటూ సోనూసూద్ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే.. నంద కిశోర్ అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలును తాము ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. అదే ఒరవడిని తెలంగాణ ప్రజల కోసం కొనసాగించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా నిజమైన సూపర్ హీరో కేటీఆర్ అని నంద కిశోర్ ట్వీట్లో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల
నంద కిశోర్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. తాను ప్రజలు ఎన్నుకున్న నాయకుడినని, తనకు చేతనైనంతా సహాయం చేస్తున్నానని అన్నారు. సూపర్ హీరో తాను కాదని.. సూపర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవచ్చని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దీనిని చూసిన సోనూ.. కేటీఆర్‌కు థాంక్స్ చెప్పారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణను తన రెండో ఇల్లుగా పరిగణిస్తున్నానని... కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని సోనూసూద్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. సోనూసూద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చేస్తున్న పని చాలా గొప్పది. మీరు కోట్లాది మందికి ఆదర్శమని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments