కేటీఆర్ రియల్ హీరో.. సోనూసూద్ సూపర్ హీరో!

రాష్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ముచ్చటించుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సోనూసూద్‌ను కేటీఆర్ సూపర్ హీరో అయంతే.. కేటీఆర్ రియల్ హీరో అంటూ సోనూసూద్ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే.. నంద కిశోర్ అనే ఓ నెటిజ‌న్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్ర‌దించిన 10 గంట‌ల‌లోపే త‌మ‌కు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్స్ స‌మ‌కూర్చార‌ని, ఆ మేలును తాము ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని అత‌ను పేర్కొన్నాడు. అదే ఒర‌వ‌డిని తెలంగాణ ప్ర‌జ‌ల కోసం కొన‌సాగించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా నిజ‌మైన సూప‌ర్ హీరో కేటీఆర్ అని నంద కిశోర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

నంద కిశోర్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. తాను ప్ర‌జ‌లు ఎన్నుకున్న నాయ‌కుడినని, త‌న‌కు చేత‌నైనంతా స‌హాయం చేస్తున్నానని అన్నారు. సూప‌ర్ హీరో తాను కాదని.. సూప‌ర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవ‌చ్చని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దీనిని చూసిన సోనూ.. కేటీఆర్‌కు థాంక్స్ చెప్పారు. కేటీఆరే నిజ‌మైన హీరో అంటూ కొనియాడారు. ఆయన నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణను తన రెండో ఇల్లుగా పరిగణిస్తున్నానని... కొన్నేళ్లుగా తెలంగాణ ప్ర‌జ‌లు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నార‌ని సోనూసూద్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. సోనూసూద్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మీరు చేస్తున్న ప‌ని చాలా గొప్ప‌ది. మీరు కోట్లాది మందికి ఆద‌ర్శ‌మ‌ని కేటీఆర్ రీట్వీట్ చేశారు.

More News

పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజకీయాల్లోకి రావడం కోసమే సోనూ సూద్ సేవ చేస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్‌లో వలస కూలీలకు బస్‌లు ఎరేంజ్ చెయ్యడం, ఈ ఇయర్ కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు,

2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ

క‌రోనాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసే 2డీజీ ఔషధం ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పొడి రూపంలో అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఔష‌ధం.. ఒక మోస్తరు నుంచి తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు

మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ మంగళవారం క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఎస్వీ ప్ర‌సాద్‌ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆయనతోపాటు ఆయన కుటుంబ

పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

పాకిస్తాన్‌లో భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఇవాళ ప్రశాంత్ హైదరాబాద్ చేరుకోనున్నాడు. 2017 ఏప్రిల్ నెలలో ప్రశాంత్ అదృశ్యమయ్యాడు.

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం

ఛత్తీస్‌గఢ్ బాటలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా నడుస్తోంది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న