నల్లమలపై స్పందించిన కేటీఆర్.. విజయ్ దేవరకొండ రిప్లై
Send us your feedback to audioarticles@vaarta.com
యురేనియం కోసం నల్లమల అడవుల్లో తవ్వకాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని వల్ల అడవులు నాశనం నాశనం అవుతుంది. అయితే నల్లమలను అడవులను నిర్మూలించడం ద్వారా పర్యావరణం నాశనం అవుతుందని అందరూ గళమెత్తారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. దర్శకులు, హీరోలు నల్లమలను నాశనం చేయవద్దు అంటూ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా విన్నవించారు. దీనిపై తెలంగాణ మినిష్టర్ కేటీఆర్ స్పందనను తెలియజేశారు. `నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై మీ అభిప్రాయాలను విన్నాను. మీ విషయం గురించి ముఖమంత్రి కేసీఆర్‌గారితో ప్రత్యేకంగా చర్చిస్తాను` అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు.. `ఇది తొలి విజయం. మనమంతా మన గళాన్ని వినిపించాం. తగిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇది పూర్తయ్యే వరకు ఆపొద్దు. అమ్రాబాద్ ప్రజలకు, నల్లమలకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది` అని అన్నారు.
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపితే పర్యావరణం పాడవుతుంది. యురేనియం కొనుగోలు చేయవచ్చు కానీ.. నల్లమలను కోనుగోలు చేయవచ్చా? అంటూ పవన్‌కల్యాణ్, విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల, నాగాశ్విన్ తదితరులు ట్విట్టర్లో `సేవ్ నల్లమల` అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ పోస్టులు చేశారు.
1st win :)
— Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2019
We came together, We have been heard, and steps are being taken, now let's not stop till we #SaveNallamala completely.
All the people of Amrabad - Nallamalla you have my unconditional support and the support of million other brothers and sisters of yours. https://t.co/BTM7xbTwl2
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments