బాబు ఓడిపోతున్నారు.. గెలిచేది వైసీపీనే.: కేటీఆర్

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

గత కొన్నిరోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. టీడీపీ సిట్టింగ్‌‌లు అందరూ ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చేరికల వెనుక కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శులు గుప్పించిన సంగతి తెలిసిందే. సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబు కూడా ఇవే మాటలు పలకడం గమనార్హం. అటు టీడీపీ నేతలు, చంద్రబాబు మాటలు విన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్టకేలకూ స్పందించారు.

కేటీఆర్ మాటల్లోనే...

రానున్న 2019 ఎన్నికల్లో చేతకాని తనం వల్ల చంద్రబాబు ఓడిపోతున్నారు. చంద్రబాబు కలలో కూడా సీఎం కేసీఆర్‌ను కలవరిస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు కూడా ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఒడిపోవడం ఖాయం. ఏపీలో వైసీపీ గెలవబోతోంది. ఢిల్లీలో చంద్రబాబు తిప్పడం కాదు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో కూడా చక్రం తిప్పలేరు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అంత మాత్రాన చంద్రబాబుకు ఉలిక్కిపాటు ఎందుకు?. ఆంధ్రకు వ్యతిరేకంగా మేమే ఏం చేశామో చంద్రబాబు చెప్పాలి. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు ప్రజలను వేధించారు. హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని చంద్రబాబే అంటారు.. మరోవైపు మేమే నంబర్ వన్ అంటారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబుకే నష్టం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్నికల గురించి..

ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తాం. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కాంగ్రెస్ అడిగింది. మాకు ఐదు స్థానాలు గెలిచే సంఖాబలం ఉంది. పార్లమెంట్ సన్నాహక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాతే కమిటీలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉంటుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం. 16 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని ప్రజలను కోరుతాం. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీకి తగిన సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిలీని డిమాండ్.. కమాండ్ చేయవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో లేచే పరిస్థితి లేదు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనేది కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు.

More News

కేసీఆర్ కేబినెట్‌‌లో ఇద్దరు మహిళలకు అవకాశం

తెలంగాణ కేబినెట్ మొదటి విస్తరణ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విస్తరణలో మహిళా ఎమ్మెల్యేలకే కాదు సొంత ఇంట్లోని వారికి కూడా గులాబీ బాస్,

టికెట్ దక్కించుకున్న టీడీపీ అభ్యర్థికి ఊహించని షాక్!

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అటు వైసీపీ.. ఇటు టీడీపీ అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎయిర్ షో లో అగ్నిప్రమాదం.. 300 కార్లు బుగ్గి

బెంగళూరులోని యలహంకలో రిహార్సల్స్ చేస్తున్న రెండు రెండు సూర్యకిరణ్‌ విమానాలు కుప్పకూలిన ఘటన మరువక ముందే మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి'

సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి,సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ 'విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కారం.

కార్తితో హిట్ బాంబ్.. క‌లిసొచ్చేనా?

హీరో కార్తికి రీసెంట్‌గా విడుద‌లైన దేవ్ పెద్ద‌గా క‌లిసి రాలేదు. డిజాస్ట‌ర్ అయ్యింది.