రాజ్‌నాథ్‌తో కేటీఆర్ భేటీ.. భూముల అప్పగింతపై చర్చ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు విషయాలపై మంత్రులిద్దరూ చర్చించారు. అలాగే, 44, 1వ నంబరు జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రక్షణ భూముల అప్పగింత వ్యవహారంపై రెండు లేఖలను రక్షణ మంత్రికి కేటీఆర్ అందజేశారు. అనంతరం ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను రాజ్‌నాథ్‌ను కలిసిన విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానికి ఫోటోలను కూడా జత చేశారు. ఇదిలా ఉంటే.. గతంలో నిర్మలా సీతారామన్ రక్షణ శాఖా మంత్రిగా వున్నపుడు కూడా పలు మార్లు కోరినప్పటికీ రక్షణ శాఖ భూముల కేటాయింపుపై ఢిల్లీలో భేటీ అయిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments