'కాదలి' ఆడియో విడుదల చేసిన కె.టి.ఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
పట్టాభి.ఆర్.చిలుకూరి దర్శక నిర్మాణంలో పూజా కె. దోషి, హరీశ్ కల్యాణ్, సాయి రోణక్, సుదర్శన్, మోహన్ రామన్, డా. మంజేరి షర్మిల, గురురాజ్ మానేపల్లి తదితరులు నటించిన సినిమా `కాదలి`. ఈ సినిమాలోని పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామ్‌చరణ్ ఆడియో బిగ్ సీడీలను విడుదల చేశారు. కేటీఆర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. సురేశ్‌బాబు అందుకున్నారు.
పట్టాభి ఆర్. చిలుకూరి నా బాల్య మిత్రుడు. పట్టాభి పాతికేళ్ల క్రితమే సినిమా గురించి మాట్లాడేవాడు... సినిమాల్లో ఉండాలని అనుకున్నాడు. ఐటీ ఇండస్ట్రీ హైలో ఉన్నప్పుడు పట్టాభి ఆ రంగాన్ని వదులుకుని ఈ రంగంలోకి వచ్చారు. తన కల కాదలి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. అంతా కొత్తవారితో చేస్తున్న ఈ సినిమా చాలా రెఫ్రెషింగ్‌గా ఉంది. ట్రైలర్ చాలా బావుంది. కొన్ని సినిమాలు ఇటీవల బాగా ఆడుతున్నాయి. పెళ్లిచూపులు లాంటివి బెంచ్ మార్క్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ కింగ్‌లాగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని భావిస్తున్నాం. బాహుబలి2 తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. కేలిఫోర్నియాలో లోకల్ గేమింగ్ కంపెనీ వాళ్లు ఆ సినిమా గురించి మాట్లాడటం గ్రేట్. ఒక దేశానికి ఒక ట్యాక్స్ అనేది మంచిదే.
కానీ సంస్కృతి, స్వరూపాలు అనేవి కాపాడుకోవాలంటే 28 శాతం పెడితే కుదరదని చాలా మంది అంటున్నారు. ఈ మధ్య కమల్‌హాసన్‌గారు కూడా దీని గురించి చెప్పడం విన్నాను. దక్షిణాది పరిశ్రమలన్నీ కలిసి అరుణ్‌జైట్లీగారిని కలుద్దాం అని మంత్రి కె.టి.ఆర్ అన్నారు.
దాసరిగారు చనిపోయిన తర్వాత జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది. మిస్ యూ దాసరిగారు. సురేశ్‌గారు జీఎస్‌టీ గురించి చెప్పగానే స్పందించినందుకు కేటీఆర్‌గారికి ధన్యవాదాలు. నా కెరీర్‌లో మోస్ట్ ఫేవరేట్ చిత్రం నా కెరీర్‌లో ఆరంజ్. అలాంటి సినిమాను మరలా మరలా చేయాలని అనుకుంటాను. అలాంటి కళ, కలర్స్ ఉన్న ఈ సినిమా ఎక్కువ ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్యాషన్‌ని నమ్మి చేస్తున్న పట్టాభికి కంగ్రాట్స్. నా తొలి సినిమాలో కూడా నేను ఇంత బాగా చేయలేదేమో. వాళ్లు అంత బాగా చేశారని రాంచరణ్ చెప్పారు.
పట్టాభి ఎప్పుడూ తన అభిప్రాయాలను కచ్చితంగా చెబుతాడు. ఈ సినిమా చాలా మంచి హిట్ కావాలి. మేం ఏం అడిగినా కేటీఆర్‌గారు చేస్తారు. జీఎస్‌టీ ప్రాబ్లమ్ ఉందని గత సారి చెప్పినప్పుడు వెంటనే అరుణ్ జైట్లీ దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు సినిమాకి జీఎస్‌టీని 28 శాతానికి పెంచారు. దీని వల్ల ప్రాంతీయ భాషా చిత్రాలకు పలు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయంలో పెద్ద, చిన్న చిత్రాలకు ఒకే రకమైన శాతం కాకుండా, ప్రాంతీయ చిత్రాలకు మరోలా ఉంటే బావుంటుంది. తెలుగు పరిశ్రమకు ఎప్పటినుంచో మద్దతిస్తున్న కేటీఆర్‌గారు ఈ విషయంలోనూ సహకరించాలని డి.సురేష్‌బాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ చిత్రయూనిట్‌ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com