KTR:హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈరేస్(FEO) రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ శాఖ.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. అందుకే ఫిబ్రవరి 10న జరగాల్సిన రేస్‌ను రద్దు చేశామని వెల్లడించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
నగరంలో ఫార్ములా ఈరేస్ రద్దుపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమే అని మండిపడ్డారు. హైదరాబాద్ ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయని అభిప్రాయపడ్డారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఇ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి తాము చాలా కష్టపడ్డామని వివరించారు. ప్రపంచంలో హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూపించడానికి, ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌లను ఆకర్షించడానికి ఫార్ములా రేసును ఓ సాధనంగా చేసుకున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగతానే భాగంగానే తెలంగాణ మొబిలి వాలీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడా ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి గతేడాది అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫార్ములా-ఈ రేస్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రేస్‌ను మెక్సికోకు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన ప్రారంభోత్సవ రేస్ విజయవంతమైందని రేస్ నిర్వాహకులు తెలిపారు. ఈ రేస్ వల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రగతి జరిగిందని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ పేర్కొన్నారు.
బ్రాండ్ హైదరాబాద్ కు భారీ దెబ్బ...
— BRS Party (@BRSparty) January 6, 2024
హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్ (Formula-E race) రద్దు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పష్ణమైన నిర్ణయం రాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడి. pic.twitter.com/wacNkwTkMr
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout