బుడ్డోడి డ్యాన్స్‌కు కేటీఆర్ ఫిదా.. నెటిజన్లు ఫైర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో మంత్రి కేటీఆర్ ఒకరు. అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇస్తూ ఉంటారు. అభిమానులతో ఇంటరాక్షన్‌లో భాగంగా కేటీఆర్ ఇచ్చిన పలు సమాధానాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా కేటీఆర్ ఒక బుడ్డోడి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. ఒక బుడ్డోడు గేటు అవతల ఉన్న రెండు కుక్కపిల్లలను టెంప్ట్ చేస్తూ గేటు బయట ఉండి డ్యాన్స్‌ను ఇరగదీశాడు. బుడ్డోడి డ్యాన్స్‌ను చూసిన పప్పీస్ కూడా గంతులేయడం విశేషం.
ఈ వీడియోను ఒక నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన కేటీఆర్ బుడ్డోడి డ్యాన్స్‌కి ముగ్ధుడైపోయారు. ‘ఏం డ్యాన్సింగ్ స్కిల్ డ్యూడ్.. యు కిల్డ్ ఇట్’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి స్మైలీ ఎమోజీతో పాటు క్లాప్స్ను కూడా జోడించారు. కేటీఆర్ చేసిన కామెంట్‌పై అభిమానులు కొందరు కేటీఆర్ ట్వీట్ చూసి సంతోషం వ్యక్తం చేస్తుండగా... మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు ఎల్ఆర్ఎస్ కారణంగా ఇబ్బంది పడుతుంటే.. మీ నాన్న సచివాలయం కోసం మీ పార్టీ వాళ్లు సంబరాల్లో మునిగిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇలాంటి డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేస్తున్నారా? అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరోనాతో మీరు పెట్టే ఎల్ఆర్ఎస్ దోపిడి గురించి బాధపడుతుంటే, మీ నాన్న సచివాలయం కోసం మీ పార్టీ వాళ్ళు సంబరాల్లో మునిగి పోతున్నారు మీరు ఇలాంటి డ్యాన్స్‌లు ట్వీట్ చేస్తున్నారు. హథవీధి..!!’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమస్యలపై స్పందించరు కానీ ఇలాంటి వీడియోలపై స్పందించడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
What dancing skill dude ??????
— KTR (@KTRTRS) October 5, 2020
You killed it?? https://t.co/KrEpTCLbHx
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments