'మే' డే వేడుకల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రం అట్టుడికిన సంగతి తెలిసిందే. బోర్డు తప్పిదాలతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ కీలకనేత రేవంత్ రెడ్డి, వీహెచ్ హనుమంతరావు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్లోబరినా సంస్థ తెలియదనడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. మే డే సదర్భంగా పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఊరుకునే ప్రసక్తే లేదు..
"ఐటీ మంత్రిగా ఉంటె నాకే సంబంధమా.? రూ.4 కోట్ల టెండర్ ఉంటే.. రూ.10 వేల కోట్ల స్కామ్ అంటూ ఒకాయన సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకొకరు పెద్దమ్మగుడికి రా అంటూ ఓ బఫున్ పిలుస్తున్నారు. ప్రతి పక్షాలు చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు. ప్రతిపక్షాలకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. అడ్డుగోలుగా మాట్లాడితే ఊరుకోను. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తాను" అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
నేనూ ఓ తండ్రినే..
మేం సంయమనం పాటిస్తున్నాం. నోరు లేకా కాదు.. మాట్లాడటం రాకా కాదు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో రాజకీయంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. తప్పు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నేనూ ఓ తండ్రినే.. పిల్లల భాద నాకు తెలుసు. తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల విషయంలో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇక విద్యాశాఖకు సంబంధించిన అంశాన్ని ఐటీ శాఖకు లింకుపెడుతున్నారు.. దానితో సంబంధమేంటి..? టెండర్లు ఇచ్చింది ఇంటర్ బోర్డు కదా?. కేసీఆర్‌ను ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకు మద్దతుగా కత్తులు దూసే మీడియాలు కొన్ని ఉన్నాయి. వాళ్లకు ఇంకేం పని ఉండదు. 24 గంటలు రీళ్లు తిప్పడమే పని. నేను ఇంటర్ విద్యార్థులకు చేతులు జోడించి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే తిరిగిరావు. చదువే జీవితం కాదు. తప్పు జరిగింది. ప్రభుత్వం మళ్లీ రీవెరిఫికేషన్ చేస్తోంది. కాబట్టి తొందరపడి ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లను క్షోభకు గురిచేయవద్దు" అని కేటీఆర్ కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com