అనారోగ్యంపై వచ్చిన వార్తలపట్ల కేటీఆర్ క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మంత్రి కేటీఆర్ అనారోగ్యంగా ఉన్నారని.. గత రెండు మూడ్రోజులుగా ఆయన బాధపడుతున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆప్తులు ఆందోళన చెందారు. కొందరు సోషల్ మీడియా వేదికగా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయగా.. ఇంకొందరు కాల్ చేసి మరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా వార్తలు ఎక్కవవుతుండటం.. మరోవైపు ఇష్టానుసారం ప్రచారం జరుగుతోంది. ఇలా అందరూ ఆందోళన చెందుతుండటంతో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా..
‘నిన్నటి నుంచి నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నిన్న సిరిసిల్లలో పర్యటిస్తున్న సందర్భంగా అనేక సంవత్సరాలుగా నాకు జలుబుతో కూడిన ఎలర్జీ ఉంది. చాలా ఏళ్లుగా అలర్జటిక్ జలుబుతో బాధపడుతున్నాను. నిన్న సిరిసిల్ల వెళ్లేటప్పుడు కూడా అలాగే వచ్చింది. అకస్మాత్తుగా పర్యటన రద్దు చేసుకోలేక.. అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చాలామందికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చింది’ అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చుకున్నారు. కేటీఆర్ స్పందించడంతో అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన తగ్గింది.
నా లక్ష్యం అదే..
కాగా.. సోమవారం నాడు కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు. చేనేత సోదరులు, సోదరీమణుల ప్రతిభ పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. సిరిసిల్లలో చేనేత పని పునఃప్రారంభమైందని, బతుకమ్మ చీరలు నేయడం కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. సిరిసిల్ల చేనేత ఉత్పత్తులంటే ఓ ఎన్నదగిన బ్రాండ్‌గా అభివృద్ధి చేయడమే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. ఈ స్వప్నం సాకారమవ్వాలంటే టెక్స్ టైల్ పార్క్, అప్పెరెల్ పార్క్ ఎంతో కీలకమని కేటీఆర్ తన మనసులోని మాటను చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout