KTR: మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్‌కు దమ్ముంటే సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం కలిసి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. గతంలో కూడా కొడంగల్ అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాగే సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువ ఏముంటుంది? అని ప్రశ్నించారు.
తనది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీది ఏ కోటా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా.. డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. పేమెంట్ కోటా కాబట్టే ఢిల్లీకి పేమెంట్ చేయాలని.. బ్యాగులు మోయాలని విమర్శించారు. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరిస్తున్నారని.. రేవంత్ తీరును వ్యాపారస్తులు వ్యతిరేకిస్తున్రాని.. త్వరలోనే వారు రోడ్డు ఎక్కుతారని తెలిపారు. తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చని.. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండని వెల్లడించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఆయన మగాడైతే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే శుక్రవారం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం 'ఛలో మేడిగడ్డ' పర్యటనకు వెళుతుందని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద పర్యటిస్తామన్నారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. నీటి పారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకువెళతామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 'ఛలో పాలమూరు' పర్యటన చేపట్టనుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.
కాగా ఇటీవల జరిగిన చేవెళ్ల జన జాతర సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్లని వేపచెట్టుకు కట్టేసి తొండలను వదలండన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాకపోతుండే అని కేటీఆర్ అంటున్నాడని.. ఇవాళ తాను ముఖ్యమంత్రిగా పార్లమెంట్ ఎన్నికలకు వస్తున్నానని.. కేటీఆర్‌కు దమ్ముంటే.. మగాడైతే ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments