KTR: మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్‌..

  • IndiaGlitz, [Thursday,February 29 2024]

ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్‌కు దమ్ముంటే సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం కలిసి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. గతంలో కూడా కొడంగ‌ల్ అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఇలాగే స‌వాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు. స‌వాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాట‌కు విలువ ఏముంటుంది? అని ప్రశ్నించారు.

తనది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీది ఏ కోటా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా.. డ‌బ్బులిచ్చి ప‌ద‌వి తెచ్చుకున్నారని ఆరోపించారు. పేమెంట్ కోటా కాబ‌ట్టే ఢిల్లీకి పేమెంట్ చేయాలని.. బ్యాగులు మోయాలని విమర్శించారు. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారుల‌ను బెదిరిస్తున్నారని.. రేవంత్ తీరును వ్యాపారస్తులు వ్యతిరేకిస్తున్రాని.. త్వరలోనే వారు రోడ్డు ఎక్కుతారని తెలిపారు. తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చని.. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండని వెల్లడించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఆయన మగాడైతే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే శుక్రవారం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం 'ఛలో మేడిగడ్డ' పర్యటనకు వెళుతుందని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద పర్యటిస్తామన్నారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. నీటి పారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకువెళతామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 'ఛలో పాలమూరు' పర్యటన చేపట్టనుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.

కాగా ఇటీవల జరిగిన చేవెళ్ల జన జాతర సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్లని వేపచెట్టుకు కట్టేసి తొండలను వదలండన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాక‌పోతుండే అని కేటీఆర్ అంటున్నాడ‌ని.. ఇవాళ తాను ముఖ్యమంత్రిగా పార్లమెంట్ ఎన్నికలకు వస్తున్నానని.. కేటీఆర్‌కు దమ్ముంటే.. మగాడైతే ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాల‌ని ఛాలెంజ్ చేశారు.

More News

Nagababu:నా మాటలకు ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’(Operation Valentine) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో

YSRCP: ఏపీలో వైసీపీ సునామీ మరోసారి ఖాయం.. ప్రముఖ సర్వేలో వెల్లడి..

అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేనలు కూటమిగా సిద్ధమయ్యాయి. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

YCP:వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌.. అక్కడి నుంచి పోటీ..!

సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి.ఇంతియాజ్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Ranveer Deepika:పెళ్లి అయిన ఆరేళ్లకు.. గుడ్ న్యూస్ చెప్పిన రణ్‌వీర్-దీపికా..

గత కొంతకాలంగా బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.

DSC:నిరుద్యోగులకు శుభవార్త.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది.