చంద్రబాబు దమ్ముంటే ఎదుర్కో..: కేటీఆర్ సవాల్

  • IndiaGlitz, [Monday,March 04 2019]

గత మూడ్రోజులుగా జరుగుతున్న డేటా వార్ తెలంగాణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు ప్రధాన పార్టీలూ సీరియస్‌గా తీసుకున్నాయి. అయితే మీడియా ముందుకొచ్చిన తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి మాట్లాడుతూ వైసీపీ, టీఆర్ఎస్‌‌‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ఐటీ గ్రిడ్‌కు సంబంధించిన కేసు కోర్టుదాకా వెళ్లింది.. నలుగురు ఉద్యోగులను వదిలేయడం జరిగింది. అయితే ఈ హెపియస్ కార్పస్ రిట్ వేసిన కంపెనీ డైరెక్టర్ అశోక్‌‌ కోసం తెలంగాణ పోలీసులు ఐదు ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

ఈ తరుణంలో టీఆర్ఎస్‌పై వచ్చిన ఆరోపణలకు గాను ఆ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్‌‌బాబుకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దమ్ముంటే కేసును ఎదుర్కోవాలంటూ చంద్రబాబుకు కేటీఆర్ సవాల్ విసిరారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌కు బుకాయింపు మాటలు ఎక్కువగా వస్తాయని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసు ప్రస్తావనకు తెచ్చిన ఆయన.. ఈ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకలేదా? అని సూటి ప్రశ్న సంధించారు. సానుభూతి కోసమే కేసీఆర్‌పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా జరగాల్సింది జరిగి తీరుతుందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు బుకాయింపు మాటలెక్కువని ఆయన విమర్శలు గుప్పించారు.

టీడీపీకి ఆ మాత్రం తెలియదా..?

ఏపీ పౌరుడు తెలంగాణలో ఫిర్యాదు చేస్తే.. ఇక్కడే కేసు పెడతారు.. టీడీపీకి ఆ మాత్రం కూడా తెలియదా?. ఐటీ గ్రిడ్స్‌పై కేసు నమోదైతే స్పందించడం తప్పా? ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న ఫిర్యాదు వచ్చింది. మాకు వచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు స్పందించారు. అసలు ఈ కేసు విషయంలో ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటి?. చేసిందే తప్పు అయితే దాన్ని మళ్లీ మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలని మాట్లాడుతున్నారు. కేసు నమోదైందే వాళ్లపైన.. దొంగతనం చేసినోడి దగ్గరకే ఎక్కడానై కేసు బదలాయిస్తారా?.. దొంగనే ఎక్కడైనా కేసు విచారణ చేస్తారా?. దమ్ముంటే కేసును ఎదుర్కొండి.. కడిగిన ముత్యంలా బయటకు రండి ఎవరు వద్దన్నారు?. మరోవైపు సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.. ఒకప్పుడు చంద్రబాబు నాటకాలు ప్రజల దగ్గర నడిచాయి.. కానీ, ఇప్పుడు సాగవు అని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పార్టీ మార్పుల వ్యవహారంపై...

భవిష్యత్తు కోసం, వారి ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకులు పార్టీ మారడం తప్పు కాదు. పార్టీ మారితే అమ్ముడు పోయినట్లు మాట్లాడటం తప్పు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్‌లో చేరడం ఒప్పు అవుతుందా?. చంద్రబాబు పార్టీ మారలేదా?.. చంద్రబాబు పెట్టించారా తెలుగుదేశం పార్టీని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకే చెందిన వాళ్లా? వాళ్లు ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్లు కాదా?. ఏది మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. రేవంత్‌రెడ్డిని ఎంతకు కొన్నారు..?. పార్టీ మారడమే తప్పు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు సరైంది కాదు. కాంగ్రెస్‌ నేతలవి దురహంకార మాటలు. ప్రజల్లో రాజకీయ వ్యవస్థను మనమే దిగజారుస్తున్నాం. కాంగ్రెస్‌లో చేవచచ్చిందని స్వయంగా రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మాదారి మేమే వెతుక్కుంటామని రాజగోపాల్‌రెడ్డే చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు ఎంతకు కొన్నారు? అని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

మొత్తానికి చూస్తే.. ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంలో తమ పార్టీ పాత్రగానీ.. ప్రభుత్వపాత్రగానీ ఏమీ లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

మ‌హేష్ మూవీ టైటిల్ `వాట్స‌ప్‌`?

మ‌హేష్ నెక్స్ట్ మూవీ గురించి సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెక్క‌ర్లు కొడుతోంది. మ‌హేష్ ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌టిస్తున్నారు.

నాగ‌శౌర్య జ‌త‌గా షాలినీ!

నిన్న‌మొన్న‌టిదాకా నిలిచి నిదానంగా సినిమాలు చేసిన అర్జున్‌రెడ్డి భామ ఇప్పుడు స్పీడు పెంచింది. మేఘ పాత్ర‌లో '118'లో ఈ భామ క‌నిపించింది. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్

స‌మంత ఇప్పుడు 'జాన‌కి దేవి'

స‌మంతను అంద‌రూ కొత్త‌గా జాన‌కీ, జాన‌కీదేవి అని పిలుస్తున్నార‌ట‌. స‌మంత  పేరు మార్చుకుందా?  జాన‌కి దేవి అని ఎందుకు పిలుస్తున్నారు. అని ఆస‌క్తిగా ఉందా..

బాలీవుడ్‌కి వెళ్తున్న నాని నాయిక‌!

నాని హీరోగా న‌టిస్తున్న 'జెర్సీ' చిత్రంలో ఆయ‌న స‌ర‌స‌న న‌టిస్తున్న క‌న్న‌డ న‌టి శ్ర‌ద్ధా శ్రీనాథ్‌. ఈమె తాజాగా బాలీవుడ్‌లో 'మిలాన్ టాకీస్‌'తో అడుగుపెడుతున్నారు.

వామ్మో రాశీ... ఎంత నేర్చింది!

`భాష రాదు` అని హీరోయిన్లు ఇంగ్లిష్‌లో ముద్దుముద్దుగా చెప్ప‌డం నిన్న‌టి విష‌యం. ఇప్పుడు త‌రం మారింది. తార‌లంద‌రూ అన్ని భాష‌లూ నేర్చుకుంటున్నారు.