మహేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమంతుడు`తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కి అభిమానుల నుండే కాదు, రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. డబ్బున్న శ్రీమంతుడు` ఓ వెనకబడ్డ విలేజ్ ను దత్తత తీసుకుని ఎలా డెవలప్ చేశాడనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా చూసి చాలా మంది ఇన్ స్ఫైర్ అయ్యారు కూడా.
రీసెంట్ గా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మహేష్ మాట్లాడుతూ శ్రీమంతుడు` నాకు చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే నా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ రావడమే కాదు, నేను ఇంకా మంచి మనిషిగా మారడానికి దోహదం చేసింది. స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు బుర్రిపాలెంను దత్తత తీసుకోమని చెప్పారు. ఈ సందరర్భంగా బావ గల్లా జయదేవ్ గారికి థాంక్స్.
అలాగే శ్రీమంతుడు సక్సెస్ తర్వాత తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు ఫోన్ చేసి అభినందించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడ్డ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేయమని సలహా ఇచ్చారు. నేను అలాగే అన్నాను. వీటికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com