KTR: మీడియా సంస్థలకు కేటీఆర్ బామ్మర్ది లీగల్ నోటీసులు.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లోని మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపడం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 16 మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేశారు. ఒక్కో మీడియా సంస్థపై ఏకంగా రూ. 10 కోట్ల కింద మొత్తంగా రూ.160 కోట్లకు దావా వేశారు.
ఇటీవల హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి రాజేంద్రప్రసాద్ అని పలు మీడియా సంస్థలు అనవసర వార్తలు రాశాయని ఆరోపిస్తూ ఈ నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న వారం రోజుల్లోపు తన పరువుకు భంగం కలిగించేలా పోస్ట్ చేసిన వార్తలు, వీడియోలను డిలీట్ చేయాలని నోటీసులలో పేర్కొన్నారు. అలాగే తనకు క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో ఈ వార్తలు, వీడియో కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి మీడియా సంస్థలకు నోటీసులు పంపడం సంచనలంగా మారింది. మరి ఈ నోటీసులపై ఆయా సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
అసలు ఏం జరిగిందంటే గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఫిబ్రవరి 25న నమోదైన ఈ కేసులో బీజేపీ నేత కుమారుడితో పాలు పలువురి ప్రముఖల హస్తం ఉందంటూ వార్తలు వచ్చాయి. అలాగే కేటీఆర్ బామ్మర్థి రాజేంద్రప్రాసద్‌కు కూడా సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తల పైనే ఆయన తీవ్రంగా స్పందిస్తూ లీగల్ నోటీసులు జారీ చేశారు.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి తెలంగాణలో డ్రగ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందుకోసం నార్కోటిక్ బ్యూరో అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ బ్యూరో చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిగా సందీప్ శాండిల్యను నియమించారు. అప్పటినుంచి రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయం, అమ్మకాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout