డిప్యూటీ సీఎంగా కేటీఆర్.. మంత్రిగా ఐపీఎస్!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా..? ఆయనతో పాటు ఐపీఎస్ అధికారి కేసీఆర్ మంత్రి వర్గంలోకి రానున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ రెండు పనులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదేంటి కేటీఆర్ సీఎం అనుకున్నారుగా.. మళ్లీ ఈ ట్విస్టేంటి..? అనుకుంటున్నారా..? ఆయన సరే మరి ఈ ఐపీఎస్ ఎవరబ్బా..? అనే సందేహాలు కలుగుతున్నాయ్.. కదూ.. ఇక ఆలస్యమెందుకు ఈ ప్రత్యేక కథనం చదివేయండి.. మీకే అర్థమైపోతుంది.
సీఎంగా కేటీఆర్!?
కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలో సీఎం పీఠంపై కూర్చొబెట్టాలని కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇప్పటికే పలుమార్లు వార్తలు గుప్పుమన్నాయ్. అయితే మునిసిపల్ ఎన్నికలు రావడంతో వాయిదా పడిందని సమాచారం. ముందుగా ఊహించినట్లుగానే ‘కారు’ స్పీడ్‌కు ‘హస్తం’, ‘కమలం’ అడ్రస్ లేకుండాపోయాయ్. దీంతో కేటీఆర్‌కే కచ్చితంగా సీఎం పీఠం కట్టబెడతారని వార్తలు వినిపించాయి. దీంతో కాస్త లేటయ్యింది. అంతేకాదు.. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నట్లు పలువురు మంత్రులు మీడియా ముఖంగా లీకులు సైతం చేశారు. రోజురోజుకూ కేటీఆర్ సీఎం అనే డిమాండ్.. నినాదాలు పెద్దగవుతున్నాయి. పైగా అన్ని విధాలా చూసినా కేటీఆర్ అర్హుడని భావించిన కేసీఆర్.. ఆయన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని అనుకున్నారట.
కాదు కాదు.. డిప్యూటీ సీఎం!?
ఇప్పటి వరకూ కేటీఆర్ సీఎం అని వార్తలు రాగా.. తాజాగా మాత్రం కాదు కాదు.. ఆయన డిప్యూటీ సీఎం అని లీకులు వస్తున్నాయి. ముందుగా డిప్యూటీ సీఎంను చేసి తర్వాత సీఎంను చేయాలని కేసీఆర్ నిశితంగా తన సన్నిహితులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే రానున్న ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా కేటీఆరే సీఎం అట. అందుకే గత కేబినెట్‌లో ఇద్దరు డిప్యూటీలను నియమించిన కేసీఆర్.. ఈ సారి మాత్రం ఒక్కర్నే నియమించడం జరిగింది. కేటీఆరే ఆ రెండో డిప్యూటీ సీఎం అని ముందునుంచే దాన్ని అలాగే ఖాళీగా ఉంచారట. ఇదే జరిగితే అనధికారికంగా కేసీఆర్ బాధ్యతలన్నీ కేటీఆర్ చూస్తారన్న మాట.
కేసీఆర్ ఏం చేస్తారు!?
ఇప్పట్లో కేటీఆర్‌ను సీఎం లేదా డిప్యూటీ సీఎం చేస్తే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారట. అయితే గత ఎన్నికల నుంచి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ గట్టిగానే హడావుడి చేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీకి రాకపోయుంటే మాత్రం కేంద్రంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మాత్రం కీలక పాత్ర పోషించేవారన్నది మాత్రం అక్షరాలా నిజం. కానీ అనుకున్నట్లు జరగలేదు కనుగ.. ఇద్దరు సీఎంలు మిన్నకుండిపోయారు. రానున్న ఎన్నికల్లో అయినా తన సత్తా ఏంటో చాటి చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే రాష్ట్రం బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించి.. జాతీయస్థాయిలో అన్నీ తానై.. తనకు తోడుగా కేకే, కవితను తీసుకెళ్లాలని గులాబీ బాస్ అనుకుంటున్నారట.
ఐపీఎస్ సంగతేంటి..!?
కేరళ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జి. లక్ష్మణ్ తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని సమాచారం. తెలంగాణ కేబినెట్‌లో కీలక శాఖ చేపట్టబోతున్నారని తెలుస్తోంది. కేరళకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్ ఆన్‌మనోరమ ఈ విషయాన్ని ప్రముఖంగా రాసుకొచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్... గతంలోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదని.. ఇప్పుడు సమయం ఆసన్నమైందట. మొదట ఆయన్ను ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ వార్తను టీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నప్పటికీ ఇది జరగటం తథ్యమట. మరి ఈయనగారికి ఏ పదవి ఇస్తారో ఏంటో..? ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే పైన చెప్పిన రెండు విషయాలు నిజమైతే మాత్రం డిప్యూటీ, కొత్త మంత్రి వస్తారన్న మాట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో ఏంటో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout