సరికొత్త సినిమా చూసామనే ఫీల్ కలిగించే చిత్రం క్షణం - క్షణం టీమ్
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్... మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం`. అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించిన క్షణం చిత్రాన్నినూతన దర్శకుడు రవికాంత్ తెరకెక్కించారు. ఈనెల 26న క్షణం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో డైరెక్టర్ రవికాంత్ మాట్లాడుతూ...ఈ సినిమాని డైరెక్ట్ చేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. ఒక మంచి సినిమా తీసామనే ఫీలింగ్ ఉంది. సినిమా చూసిన ఆడియోన్స్ కు కూడా మంచి సినిమా చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. అంతే కాకుండా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త సినిమా చూసామని ఫీలవుతారు. ఈ సినిమాని నిర్మించడానికి కోటి రూపాయలు బడ్జెట్ కేటాయించిన పి.వి.పి గారు ప్రమోషన్ కోసం కూడా కోటి రూపాయలు కేటాయించారు. టీమ్ అంతా కలసి ఎంతో ఇష్టంతో తీసిన ఈ క్షణం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ...ఎప్పుడూ ఒక మంచి సినిమాను అందించాలని పి.వి.పి గారు తపిస్తుంటారు. అడవి శేషు, ఆదా శర్మ, రవి వర్మ...వీళ్లందరితో ఫస్ట్ టైం వర్క్ చేసాను. ఈ ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మరచిపోలేను అన్నారు.
అడవి శేషు మాట్లాడుతూ...క్షణం సినిమా నా డ్రీమ్. ఈ సినిమా కథ ఏమిటనేది తెలిసేలా క్షణం లోగోను డిజైన్ చేసాం. నేను తెరకెక్కించిన కర్మ సినిమాని మూడు కోట్లులో తీసాం. ఈ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకుని కోటి రూపాయల్లో పూర్తి చేసాం. ఖచ్చితంగా క్షణం అందరికీ నచ్చుతుంది అన్నారు.
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...కోటి రూపాయల బడ్జెత్ తో క్షణం సినిమాని తీసాం. కోటి రూపాయలు ప్రమోషన్స్ కోసం కేటాయించాను. భగవంతుని దయ వల్ల సినిమా విజయం సాధిస్తుందనుకుంటున్నాను. విజయం రాకపోతే విజయం కోసం మరో ప్రయత్నం చేస్తాను అంతే తప్ప సినిమా తీయడం మాత్రం ఆపను అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీ చరణ్, ఆదా శర్మ, అనసూయ, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments