'క్షణం' చిత్రాన్ని నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మాణ రంగంలో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు సమాయత్తమైంది. అందులో భాగంగా పివిపి బ్యానర్ తీసుకున్న తొలి అడుగు క్షణం` సినిమాయే. కోటి పది లక్షల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పివిపి బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ డ్రామా క్షణం`. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులు, అభిమానుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు సెన్సెషనల్ విజయ సాధించిన ఈ చిత్రాన్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ దేశమంతటా సబ్ టైటిల్స్ తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఎన్నో బాలీవుడ్ చిత్రాలను నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ సంస్థ, పివిపి లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో జత కట్టడం ఆనందించదగ్గ పరిణామం. సస్పెన్స్ థ్రిల్లర్ గా అనేక ట్విస్ట్ లతో సాగిన ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు అడివిశేష్, ఆదాశర్మ, అనసూయ నటనను, రవికాంత్ పెరేపు టేకింగ్ ను మెచ్చుకుంటున్నారు. త్వరలోనే దేశమంతటా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం మరిన్ని సంచనాలను క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com