ఆ చిత్రాల సరసన 'తేజ్ ఐ లవ్ యు' చిత్రం నిలుస్తుంది - నిర్మాత కె ఎస్ రామారావు
Send us your feedback to audioarticles@vaarta.com
1967లో ఇండస్ట్రీలోకి ప్రవేశించి ప్రముఖ దర్శకుడు కె స్ ప్రకాష్ రావు వద్ద 'బందిపోటు దొంగలు' చిత్రానికి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి కెరీర్‌ని ప్రారంభించారు కె స్ రామారావు. ఆతర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా సూపర్ డూపర్ చిత్రాలను నిర్మించారు.
ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వుంటూ సినిమా రంగంతో అనుబంధం ఏర్పరుచుకున్న ఈయన నాలుగు దశాబ్దాలుగా అభిలాష, రాక్షసుడు, చాలెంజ్, మాతృదేవోభవ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు.. కె స్ రామారావు.
లేటెస్ట్ గా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయినగా ఎ కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్.రామారావు నిర్మించిన ప్రేమకథా చిత్రం 'తేజ్'ఐ లవ్ యు.ఈ చిత్రం జులై 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె స్ రామారావు తో ఇంటర్వ్యూ విశేషాలు.
తేజ్ ఐ లవ్ యు ఎలా ఉండబోతుంది?
క్రియేటివ్ కమర్షియల్ మూవీ మేకర్స్ బ్యానర్ లో 45వ సినిమాగా వస్తున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యు' మంచి ఫీల్, ఎమోషన్స్ ఉన్న క్లీన్ సినిమా ఇది.. గోపి సుందర్ మ్యూజిక్, కరుణాకరన్ వే ఆఫ్ డిజైన్ తో వచ్చిన అందమైన చిత్రం. డార్లింగ్ స్వామి చక్కటి డైలాగ్స్ ను అందించారు.. సాయి ధరమ్ తేజ్ కు కూడా మంచి పేరు తెచ్చి పెడుతుందని నమ్ముతున్నాను.
45 చిత్రాలను నిర్మించారు కదా.. ఈ చిత్రానికి నిర్మాతగా ఎలాంటి అనుభవం వచ్చింది?
ప్రతి చిత్రానికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది.. ఈ సినిమాను జూన్ 29న విడుదల చేయాలా? లేక జులై 6న విడుదల చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నాము. మా శ్రేయోభిలాషులు, మరి కొందరి సూచనల మేర 6నే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం.. ఇది తప్ప మిగతా వన్నీ సర్వసాధారణం గా జరిగిపోయాయి... డైరెక్టర్ కరుణాకరన్ చెప్పినట్లు చేశారు. .. అనుకున్న దానికంటే ముందుగానే షూట్ పూర్తి చేయగలిగాం.. చక్కటి టీమ్ వర్క్ అని చెప్పొచ్చు.
పారిస్‌లో షూట్ చేసిన పాటలు గురించి చెప్పండి?
నా స్టైల్ లో కరుణాకరన్ స్టైల్ లో ఉంటాయి పాటలు.. లవ్ స్టొరీ కనుక రొమాంటిక్ గా అనిపిస్తాయి.. తేజు, అనుపమ కూడా తెరపై క్యూట్ లవర్స్‌గా కనిపిస్తారు.
తేజ్ ఐ లవ్ యు అనే టైటిల్ పెట్టడానికి కారణం ?
తేజ్ హీరో పేరు, ఇక హీరోయిన్ హీరో మధ్య జరిగిన లవ్ జర్నీ లో చివరిగా హీరోయిన్ హీరోకు లవ్ ఎస్ప్రెస్ చేస్తూ తేజ్ ఐ లవ్ యు అని చెబుతుంది.. అందుకే ఆ టైటిల్ పెట్టడం జరిగింది.
మీరు కథను ఏ విదంగా సెలెక్ట్ చేసుకుంటారు?
బేసిక్‌గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాను కనుక మొదటినుంచి కథలు వినడం, చదవడం, వాటి గురుంచి ఆలోచించడం అలవాటు అయ్యింది. ఏ ఇండస్ట్రీలో లోనైనా.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కదా.. సో పూర్తిగా తెలుసుకునే వచ్చాను... అందుకే విజయాలు వచ్చాయి.
మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకుంటారు?
అప్పుడైనా.. ఇప్పుడైనా ప్రేక్షకులకు సరిపడే నచ్చే సినిమాలే చేయాల్సి ఉంటుంది.. కథ చెప్పే విధానం, సాంకేతిక వర్గం లో జాగ్రత్తలు వంటివి తీసుకోవడం చేస్తాను.
కథలో మార్పులు చేయనమి సూచిస్తారా?
కథ నచ్చకపోతే కచ్చితంగా మార్పులు చెబుతాను. నిర్మాత సినిమా తీస్తాడు కనుక ఆ ఫ్రీడమ్ తనకు ఉంటుంది.. ఉండాలి కూడా... కథలో మార్పులు చెప్పగలిగే శక్తి కూడా నిర్మాతలో ఉండాలి.
ఈ తరం నటీనటులను హ్యాండిల్ చేయడం కష్టమంటారా?
అదేం లేదండి.. మోస్ట్ ప్రోఫ్ఫెషన్ ల్ గా, మోర్ కాన్సంట్రేషన్ గా వ్యవహరిస్తున్నారు.. ఈ తరం నటీనటులు.. నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ వంటి చాలా మంది హీరోలు చాలా ముందు చూపుతో ప్లాన్ చేసుకుంటున్నారు... అందుకే సక్సెస్ అవుతున్నారు.
ప్రొడ్యూసర్‌గా కాంబినేషన్ లాంటివి చూస్తారా?
ఈ తీరు పాత తరంలో ఉండదేమో కానీ ఇప్పుడు లేదు.. సబ్జెక్ట్ చూడాలి.. మంచి కథకు ఎవరైతే బాగుంటుందో చూడాలి.. టెక్నీషియన్స్ కూడా ఎవరంటే సరిపోతుంది అనేదానినే చూడాలి.. ఇప్పటి వారు కూడా అదే ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు.
చరణ్ మీతో సినిమా చేస్తానని చిరంజీవి అనౌన్స్ చేశారు కదా?
నా బ్యానర్లో వచ్చిన సక్సెస్ సినిమాలే కారణం. మంచి సంగీతాన్ని, మంచి ప్రాడక్ట్ ను ఇస్తారనే నమ్మకం ఉండొచ్చు.. అంతే కాకుండా సినిమా పై కేర్ కూడా తీసుకుంటామనే నమ్మకం చెర్రీ లో ఉండొచ్చు అందుకే సినిమా చేస్తానని చెప్పారు.
కొత్త నిర్మాతలు నిలబడకపోవడానికి కారణం?
అలా ఏమీ లేదు... మంచి సినిమాలు చేస్తే ఎవరైనా పెద్ద నిర్మాతగా నిలబడుతారు... రంగస్థలం, బాహుబలి సినిమాలు నిర్మించింది కొత్త బ్యానర్లేకదా.. ఆ సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచాయి.. దిల్ రాజు కూడా రీసెంట్ గా వచ్చినవాడే కదా... మంచి కథలున్న సినిమాలతో ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నాడు కదా.. సో సినిమాకు కొత్త పాత అనేది ఏమీ ఉండదు.. మినిమం గ్యారెంటీ ఉన్న మంచి కంటెంట్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తే ఎవరైనా నిలబడుతారు.
చిరంజీవి గారితో మీ అనుబంధం ఎలా ఉంది ?
చాలా బాగుంది.. ఆయన జర్నీ లో చాలా వరకు నా ప్రమేయం ఉంటుందనే చెప్పొచ్చు... అందరిలో నేను చిరును బాసు అని పిలుస్తా... అతను రామా అంటారు.. మేము ఇద్దరమే ఉన్నప్పుడు ఏ పేర్లు ఉండవు.. ఫ్రెండ్లీగా ఉంటాం.
సినిమాలలో ఇంత అనుభవం ఉన్న మీరు మీ అబ్బాయి విషయంలో సక్సెస్ సినిమా చేయలేక పోయారు కారణం?
మొదటి సినిమా ఇచ్చిన ఫలితం తోనే భయపడ్డాను... నిర్మాత బెల్లం కొండ సురేష్ తన కొడుకు విషయంలో చేస్తున్న ధైర్యం నేను చేయలేకపోతున్నా అనే అసంతృప్తి ఉంది.. కానీ నేను మా అబ్బాయితో ఒకటే చెప్పా... మనం నిర్మాతలుగా ఉన్నాం.. కనుక అదే కంటిన్యూ అయితే బాగుంటుందని చెప్పా.. అందులోనూ తను మంచి ఇంటెలిజెంట్. టెక్నీషియన్స్ పై కూడా అవగాహన ఎక్కువ తనకు. అందుకే అతను తెలిసిన దానిలోని షైన్ అప్ అయితే బాగుంటుంది కదా.. అని వదిలేసా.
బయో పిక్ చేయాలనే ఆలోచన రాలేదా?
అంత దమ్ము లేదనిపించింది.. ఒకప్పుడు పెద్ద హీరోయిన్‌తో ప్లాన్ చేశా.. బట్ తాను మరణించింది.. సో కుదరలేదు.. ప్రస్తుతం నేను బయోపిక్ ఆలోచనలో లేను.
నెక్స్ట్ సినిమా ఏంటి?
త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా, క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమాను ప్లాన్ చేసాము అక్టోబర్‌లో షెడ్యూల్ ఉంటుంది.. ఈ సినిమాకు హీరోయిన్ గా తీసుకోవడానికి 6గురును చూసాము అయితే ఇంకా ఫైనల్ అవలేదు.. మిగతా విషయాలు అన్నీ త్వరలో ప్రకటిస్తా అంటూ ముగించారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com