లెక్క సరిపెడుతున్న కృతి సనన్
Send us your feedback to audioarticles@vaarta.com
'1 నేనొక్కడినే'లో సమీరాగా, 'దోచేయ్'లో మీరాగా సందడి చేసిన కృతి సనన్.. మళ్లీ తెలుగు సినిమాకి సంతకం చేయనేలేదు. అయితేనేం.. బాలీవుడ్లో 'దిల్వాలే' వంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యింది. షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో.. వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది కృతి. డిసెంబర్ 18న రానున్న ఈ సినిమాతో తన జాతకం మారుతుందన్న నమ్మకంతో ఉందీ సుందరి.
తనకు మొదటి అవకాశమిచ్చిన టాలీవుడ్‌ని, మెదటి హిట్ నిచ్చిన బాలీవుడ్‌ని బ్యాలెన్స్‌గా డీల్ చేస్తూ తెలివిగా కెరీర్‌ని సాగిస్తోంది కృతి. గతేడాది తెలుగులో '1 నేనొక్కడినే' చేశాకనే హిందీలో ''హీరో పంతి'తో పలకరించిన కృతి.. అదే లెక్క ప్రకారమే ఈ ఏడాదిలో తెలుగులో 'దోచేయ్' చేశాకనే హిందీలో 'దిల్ వాలే'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మున్ముందు కూడా కృతి ఇలానే కెరీర్‌ని డిజైన్ చేసుకుంటుందో లేదంటే ట్రాక్ మారుస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com