అక్కడైనా కృతి బోణి బావుంటుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరికి అన్నీ ఉన్నా.. అదృష్టం మాత్రం తోడు కాదు. దాంతో వారి కెరీర్ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్.. మన కృతి కర్బందా విషయమే తీసుకోండి. తెలుగులో ఆమె హీరోయిన్గా నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటీ కూడా హిట్ కాలేదు అంటే చూడండి.. ఆమెని అదృష్టం ఎంతగా దూరం పెడుతుందో. నిన్నటికి నిన్న 'బ్రూస్ లీ' సినిమాలో అక్కగా చేసినా.. విజయం అక్కరకు రాలేదు.
సరే.. అది వేరే సంగతి. కన్నడంలో మాత్రం కృతి కథ వేరు. అక్కడ ఎంతోకొంత క్రేజ్‌ని సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇప్పుడు తమిళంలో జి.వి.ప్రకాష్‌తో కలిసి 'బ్రూస్ లీ' అనే సినిమా చేస్తోంది. తమిళంలో కృతికి ఇదే మొదటి సినిమా. విశేషమేమిటంటే.. కృతికి ఇటు తెలుగులో చేసిన మొదటి సినిమా 'బోణీ' కానీ.. అటు కన్నడంలో చేసిన మొదటి సినిమా 'చిరు' కానీ ఆశించిన విజయాల్ని అందివ్వలేదు. మరి తమిళంలోనైనా కృతి బోణి బావుంటుందా? కొన్నాళ్లు ఆగితే కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com