బాలీవుడ్‌కి ‘వినాయకుడు’.. కృష్ణుడి పాత్రలో..
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ బడ్జెట్.. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. కానీ చిన్న బడ్జెట్‌తో ఎటువంటి అంచనాలూ లేకుండా వచ్చిన సినిమాలు మాత్రం అదిరిపోయే కలెక్షన్స్‌ను అందిస్తాయి. ఆ కోవకు చెందిందే.. ‘వినాయకుడు’. ఈ సినిమాను సాయి కిరణ్ అడివి తెరకెక్కించారు. లావుగా ఉన్న వాళ్లకు ప్రేమించడానికి పనికిరారా? ప్రేమిస్తే పరిస్థితేంటి? వంటి ఇంట్రస్టింగ్ అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలోని భావోద్వేగాలు, వినోదం అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కృష్ణుడు తన పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. దీంతో ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది.
ఈ సినిమాను తమిళ్‌లో కూడా విడుదల చేయగా.. అక్కడ కూడా మంచి సక్సెస్‌ను సాధించింది. దీంతో ఇక బాలీవుడ్‌కి కూడా ఈ సినిమాను తీసుకెళ్లాలని దర్శకుడు సాయికిరణ్ డిసైడ్ అయినట్టు సమాచారం. తెలుగులో కృష్ణుడు పోషించిన పాత్రను బాలీవుడ్‌కి చెందిన ఓ కమెడియన్ పోషించనున్నట్టు తెలుస్తోంది. లావుగా ఉన్న సదరు కమెడియన్‌కి హీరోగా ఇదే తొలి చిత్రమట. ఈ సినిమాకు ఆ కమెడియన్ ఓకే చెప్పేసినట్టు సమాచారం. సాయికిరణ్ సైతం బాలీవుడ్‌కి దర్శకుడిగా తొలిసారిగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments