బాలీవుడ్‌కి ‘వినాయకుడు’.. కృష్ణుడి పాత్రలో..

  • IndiaGlitz, [Tuesday,August 11 2020]

భారీ బడ్జెట్‌.. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. కానీ చిన్న బడ్జెట్‌తో ఎటువంటి అంచనాలూ లేకుండా వచ్చిన సినిమాలు మాత్రం అదిరిపోయే కలెక్షన్స్‌ను అందిస్తాయి. ఆ కోవకు చెందిందే.. ‘వినాయకుడు’. ఈ సినిమాను సాయి కిరణ్ అడివి తెరకెక్కించారు. లావుగా ఉన్న వాళ్లకు ప్రేమించడానికి పనికిరారా? ప్రేమిస్తే పరిస్థితేంటి? వంటి ఇంట్రస్టింగ్ అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలోని భావోద్వేగాలు, వినోదం అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కృష్ణుడు తన పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. దీంతో ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది.

ఈ సినిమాను తమిళ్‌లో కూడా విడుదల చేయగా.. అక్కడ కూడా మంచి సక్సెస్‌ను సాధించింది. దీంతో ఇక బాలీవుడ్‌కి కూడా ఈ సినిమాను తీసుకెళ్లాలని దర్శకుడు సాయికిరణ్ డిసైడ్ అయినట్టు సమాచారం. తెలుగులో కృష్ణుడు పోషించిన పాత్రను బాలీవుడ్‌కి చెందిన ఓ కమెడియన్ పోషించనున్నట్టు తెలుస్తోంది. లావుగా ఉన్న సదరు కమెడియన్‌కి హీరోగా ఇదే తొలి చిత్రమట. ఈ సినిమాకు ఆ కమెడియన్ ఓకే చెప్పేసినట్టు సమాచారం. సాయికిరణ్ సైతం బాలీవుడ్‌కి దర్శకుడిగా తొలిసారిగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని సమాచారం.

More News

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... నేడు ఎన్నంటే..

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు పెరిగాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులను గతంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఏపీ, కేంద్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్

అటు ఏపీ.. ఇటు కేంద్ర ప్రభుత్వాలపై నేడు సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నేడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

హీరో సూర్య‌కు షాకిచ్చిన డైరెక్ట‌ర్‌..?

అటు త‌మిళ ఇటు తెలుగులో త‌న సినిమాల‌కు ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒక‌రు.

మాన‌సిక స‌మ‌స్య‌తో నాని..?

అదేంటి?  నేచుర‌ల్ స్టార్ నానికి మాన‌సిక స‌మ‌స్యా? అని అనుకోకండి.