పది కాలాల పాటు మరచిపోలేని చిత్రంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ నిలుస్తుంది : హను రాఘవపూడి
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ నెల 12న కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ డైరెక్టర్ హను రాఘవపూడి ఇంటర్ వ్యూ మీకోసం...
అందాల రాక్షసి తర్వాత ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏమిటి..?
అందాల రాక్షసి తర్వాత యాక్షన్ స్టోరీ చేద్దామని సంవత్సరంన్నర కథ పై వర్క్ చేసాను. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత రాసుకున్న కథ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. అందుచేతే అందాల రాక్షసి తర్వాత సినిమా చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఇక నుంచి ఇంత గ్యాప్ లేకుండా సినిమాలు తీయాలనుకుంటున్నాను.
అసలు కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఎలా పుట్టింది..?
నేను ఒక చోట కూర్చొని కథ రాసుకునే టైప్ కాదు. కథ గురించి నాకు దగ్గరగా ఉన్న వ్యక్తితో డిష్కస్ చేసిన తర్వాత రాసుకుంటాను. నానితో సినిమా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలాంటి కథతో సినిమా చేస్తే బాగుంటుందని నానితో డిష్కస్ చేసాను. మా ఇద్దరి మాటల మధ్యలో వచ్చిన ఓ ఐడియాతో ఈ కథ పుట్టింది.
ఇంతకీ కృష్ణ గాడి కథ ఏమిటి..?
కృష్ణ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అతనికి భయం ఎక్కువ. భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒకొక్కరికి ఒక్కో విషయంలో భయం ఉంటుంది. భయస్తుడైన కృష్ణ తన ప్రేమ కోసం ఏం చేసాడు. ఎలా ప్రేమను గెలిచాడు అనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అది కూడా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.
ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకున్నారు కదా..? లెంగ్తీ టైటిల్ పెట్టడానికి కారణం..?
ఈ సినిమాలో నాని బాలకృష్ణ ఫ్యాన్ గా నటించాడు. నాని చేతిపై జై బాలయ్య అనే టటూ ఉంటుంది. అది బయటకు రావడంతో ఈ సినిమాకి జై బాలయ్య అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరిగింది. ఇక లెంగ్తీ టైటిల్ విషయానికి వస్తే...కృష్ణ గాడి ప్రేమ కథ చాలా పెద్దది అందుకనే లెంగ్తీ టైటిల్ పెట్టాం. (నవ్వుతూ..)
కృష్ణ పాత్రలో నాని నటన ఎలా ఉంది..?
నిజంగా చెబుతున్నాను...కృష్ణ పాత్రలో నాని కనిపించడు. ఆ పాత్రే కనిపిస్తుంది. షూటింగ్ స్పాట్ లో నా పక్కనే ఉండే వాడు..కెమెరా ముందుకు వచ్చేసరికి వెంటనే సీన్ కి తగ్గట్టు మూడ్ లోకి వచ్చేసేవాడు. ఖచ్చితంగా ఈ సినిమా నానికి మరింత పేరు తీసుకువస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొత్త అమ్మాయి మెహరీన్ ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందా..?
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు మహాలక్ష్మి. ఆ పాత్రను ఆల్రెడీ హీరోయిన్ గా ఉన్న వారు ఎవరైనా చేస్తే...వారు అప్పటి వరకు చేసిన పాత్రల ప్రభావం పడుతుందనే ఉద్దేశ్యంతో కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నాం. మోహరీన్ తెలుగమ్మాయి కాకపోయినా చాలా బాగా నటించింది.
అందాల రాక్షసి కి ఆశించిన ఫలితం రాకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు..?
నేను అందాల రాక్షసి సినిమా తీయాలనుకున్నాను తీసాను. ఆ టైంలో అసలు రిజల్ట్ ఎలా ఉంటుందని ఆలోచించలేదు. ఇప్పుడు కూడా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో పెద్ద హిట్ కొట్టేయాలి అని ఈ సినిమా చేయలేదు. కానీ...ఈ సినిమా ఖచ్చితంగా అందరకీ నచ్చుతుంది. అలాగే ప్రతి ఒక్కరి హృదయాన్ని స్మృశిస్తుంది...ఇంకా చెప్పాలంటే పది కాలాల పాటు మరచిపోలేని చిత్రంగా నిలుస్తుందని నా నమ్మకం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..
కవచం అనే యాక్షన్ మూవీ చేస్తున్నాను. పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments