క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ మారింది..
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్నతాజా చిత్రం క్రిష్ణాష్టమి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ సరసన నిక్కి గలరాని, డింపుల్ చోపాడే హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రంలో సునీల్ ఎన్.ఆర్.ఐ గా నటించారు.
క్రిష్ణాష్టమి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ..సంక్రాంతికి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.., బాలక్రిష్ణ డిక్టేటర్, నాగార్జున సొగ్గాడే చిన్ని నాయనా..చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో క్రిష్ణాష్టమి సినిమాని సంక్రాంతికి కాకుండా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...క్రిస్మస్ కి వచ్చే క్రిష్ణాష్టమి ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com