క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్టాష్టమి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. సునీల్ సరసన నిక్కి గల్రాణి, డిపుల్ చోపాడే నటించారు. క్రిస్మెస్ కానుకగా రిలీజ్ చేసిన క్రిష్ణాష్టమి ప్రొమో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాలి. కానీ..కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది.
సంక్రాంతి కానుకగా క్రిష్టాష్టమి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ...సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీగా ఎక్కువుగా ఉండడంతో దిల్ రాజు నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం...త్వరలో ఆడియో రిలీజ్ చేసి...క్రిష్ణాష్టమి చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సునీల్ కి క్రిష్ణాష్టమి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com