క్రిష్ణాష్టమి ప్రొమో సాంగ్ రిలీజ్...

  • IndiaGlitz, [Wednesday,December 23 2015]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన తాజా చిత్రం క్రిష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న లేట్ అయ్యింది.ఇదిలా ఉంటే...

క్రిష్ణాష్ట‌మి కానుక‌గా రిలీజ్ చేసిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. జ‌న‌వ‌రిలో రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే క్రిస్మెస్ కానుక‌గా క్రిష్ణాష్ట‌మి ప్రొమో సాంగ్ ను ఈనెల 25న ఉద‌యం 10.30 ని.ల‌కు రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆడియో రిలీజ్ డేట్, మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయ‌నున్నారు. భీమ‌వ‌రం బుల్లోడు త‌ర్వాత ఎన్నో ఆశ‌లు పెట్టుకుని స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కి క్రిష్ణాష్ట‌మి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.