జనవరి 9న సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ల కృష్ణాష్టమి ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
తన హావభావాలతో, అద్భుతమైన డాన్స్ ల తో మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ ఇప్పుడు 'కృష్ణాష్టమి' అనే సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ పడుతున్నాడు.
వాసు వర్మ దర్శకత్వం లో, ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 9 న రాజమండ్రి లో ని GIET కాలేజీ లో చాలా గ్రాండ్ గా చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నిక్కి గల్రాని మరియు డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. " మా బ్యానర్ లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం ఉంది. రాజమండ్రి లో 9న ఆడియో ని రిలీజ్ చేసి, చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజ్ చేస్తాము", అని దిల్ రాజు అన్నారు.
దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".
సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
దర్శకత్వం - స్క్రీన్ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com