600కు పైగా ప్రీమియర్ షోలతో 'కృష్ణార్జున యుద్ధం'
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో రూపొందిన చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలుగా నటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించగా..తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ సంగీత దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని.. ఓవర్సీస్‌లో నానికున్న మార్కెట్ దృష్ట్యా భారీగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని సమాచారం. అందుకే ఒక్కరోజు ముందు అంటే.. ఈ నెల 11న 600కు పైగా ప్రీమియర్ షోలతో ఈ సినిమాని యు.ఎస్.లో ప్రదర్శించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకరకంగా.. నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓవర్సీస్ రిలీజ్‌గా చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. ఈ సినిమాతోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com