Home »
Cinema News »
నటుడుగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా... సంత్రుప్తి లేదు - రెబల్ స్టార్ క్రిష్ణంరాజు
నటుడుగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా... సంత్రుప్తి లేదు - రెబల్ స్టార్ క్రిష్ణంరాజు
Tuesday, January 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడుగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా...నిర్మాతగా..రాజకీయ నాయకుడుగా..ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించిన సీనియర్ హీరో రెబల్ స్టార్ క్రిష్ణంరాజు. చిలకా గోరింక సినిమాతో కెరీర్ ప్రారంభించిన క్రిష్ణంరాజు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. చిలకా గోరింక సినిమా 1966 జూన్ 10న రిలీజైంది అంటే ఈ సంవత్సరం జూన్ 10కి నటుడుగా క్రిష్ణంరాజు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. అలాగే జనవరి 20 క్రిష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ క్రిష్ణంరాజు ఇంటర్ వ్యూ మీకోసం...
కథానాయకుడుగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా...నిర్మాతగా..రాజకీయ నాయకుడుగా..ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించిన సీనియర్ హీరో రెబల్ స్టార్ క్రిష్ణంరాజు. చిలకా గోరింక సినిమాతో కెరీర్ ప్రారంభించిన క్రిష్ణంరాజు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.
ఈ సంవత్సరం జూన్ 10కి నటుడుగా 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా నటుడుగా 50 ఏళ్ల వేడుకను ఫ్యాన్స్ గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు.ఈ వేడుక ఎప్పుడు..? ఎక్కడ అనేది త్వరలో తెలియచేస్తాను. ఈ సంవత్సరం పుట్టినరోజును ఫ్యాన్స్ ఎవరికి వారు వాళ్ల ఊళ్లులోనే జరుపుకుంటున్నారు.
50 ఏళ్ల కెరీర్ ను విశ్లేషించుకుంటే మీకు ఏమనిపిస్తోంది..?
సినిమా పరిశ్రమ అంతా ఒక కుటుంబంలా ఫీలై వర్క్ చేసాం. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా...ఇన్నాళ్ల కెరీర్ ను విశ్లేషించుకుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది.
ఇన్నాళ్ల జర్నీలో మీరు ఎన్నో పాత్రలు పోషించారు. ఇంకా చేయాలనుకుంటున్నవి ఏమైనా ఉన్నాయా..?
నటుడికి సంత్రుప్తి అంటూ ఉండదు. ఎంత చేసినా...ఇంకా ఏదో చేయాలని ఉంటుంది. అందుచేత నేను చేస్తే బాగుంటుందనే మంచి పాత్ర వస్తే ఖచ్చితంగా చేస్తాను.
మీకు బాగా సంత్రుప్తి కలిగించిన చిత్రాలు ఏమిటి..?
మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మాన్న, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ..ఇలా చాలా ఉన్నాయి.
గతంలో డైరెక్షన్ చేస్తాను అన్నారు. అది ఎంత వరకు వచ్చింది..?
ఒక మంచి పాయింట్ తో సినిమా తీయాలని ఉంది. అదేమిటంటే...విద్యార్ధులను గదుల్లో పెట్టి చదువు చెబుతున్నారు. బయట అసలు ఏం జరుగుతుందనేది తెలియడం లేదు. విద్యార్ధులను తరగతి గదులకే పరిమితం చేయకుండా...కొత్త ప్రదేశాలకు తీసుకెళుతూ విద్యాభోధన చేయాలనే పాయింట్ తో సినిమా చేయాలని ఉంది. అదే ఒక్క అడుగు. ఎప్పటికైనా ఈ సినిమా చేస్తా.
నిర్మాతగా..గోపీక్రిష్ణా బ్యానర్ లో ప్రభాస్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది..?
ప్రభాస్ తో ఓ మంచి లవ్ స్టోరి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. లవ్ తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఉంటాయి. బాహుబలి 2 తర్వాత ఈ సినిమా ఉంటుంది.
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. మరి..ఈ టైం లో ప్రభాస్ లవ్ స్టోరీ చేయడం ఎంత వరకు కరెక్ట్..?
లవ్ సబ్జెక్ట్ అయినా యాక్షన్ ఉంటుంది. ఎమోషనల్ లవ్ స్టోరి గా ఈ సినిమా ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి అదేమిటంటే...నాకు రెబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఒక ఫైట్ లేకుండా అమరదీపం సినిమా చేసాను. పెద్ద హిట్ అయ్యింది. అలాగే భక్త కన్నప్ప సినిమా చేస్తున్నప్పుడు నీవు చేయగలవా..అన్నారు. భక్త కన్నప్ప సినిమాని పెద్ద వాళ్లే కాకుండా కుర్రోళ్లు కూడా చూసారు. అందుచేత బాహుబలి తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేసినా.. ఖచ్చితంగా చూస్తారు.
బాహుబలి తో ప్రభాస్ ఇమేజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళింది. ఎలా ఫీలవుతున్నారు..?
నిజమే...మీరన్నట్టు బాహుబలి తో ప్రభాస్ ఇమేజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కి పెరిగింది. నన్ను చూసి బాహుబలి పెద నాన్న అంటున్నారు. ప్రభాస్ గురించి అందరూ అలా చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. దాదాపు 800 కోట్లు పైగా బాహుబలి వసూలు చేసింది. త్వరలో బాహుబలి సినిమా చైనాలో ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినిమా ఏది కూడా వసూలు చేయనంతగా 1000 కోట్లు వసూలు చేస్తుండడం నిజంగా మనందరికీ గర్వకారణం.
ఇంతకీ...ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..?
ఈ సంక్రాంతికి ప్రభాస్ నాకు మాట ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానన్నాడు.
ప్రభాస్...ప్రేమ వివాహం చేసుకుంటాడా..? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటాడా..?
ప్రభాస్ మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడు. (నవ్వుతూ..)
ఎవడే సుబ్రమణ్యం, రుద్రమదేవి సినిమాల్లో నటించారు కదా..కొత్త సంవత్సరంలో ఏ సినిమాలో నైనా నటిస్తున్నారా..?
ఎవడే సుబ్రమణ్యం సినిమాలో రామయ్య అనే పాత్ర నేనే చేయాలని పట్టుబట్టడంతో చేసాను. అలాగే రుద్రమదేవి లో గణపతి దేవుడు పాత్ర చేసాను. నేను చేస్తే బాగుంటుందనే క్యారెక్టర్స్ వస్తే చేస్తాను.
ఈమధ్య వస్తున్న సినిమాలు చూస్తున్నారా..? మీకు నచ్చిన సినిమా ఏమిటి..?
కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు బాగున్నాయంటే చూస్తాను. ఈమధ్య భలే భలే మగాడివోయ్ సినిమా చూసాను. నాకు బాగా నచ్చింది. అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఏ హీరో ఒప్పకోరు. అలాగే ఎవడే సుబ్రమణ్యం సినిమా కూడా నాకు నచ్చింది.
అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో వచ్చిన మార్పు ఏమిటి..?
ఇండస్ట్రీలో అప్పటికి..ఇప్పటికి...చాలా మార్పు వచ్చింది. నిర్మాత పరిస్థితి క్యాషియర్ కన్నా తక్కువ స్ధాయికి పడిపోయింది.చిన్న సినిమాలకు ధియేటర్స్ సమస్య ఉంది. ఈ సమస్యకు పరిష్కారం..స్ర్కీన్స్ పెంచడమే. వీధికి ఒక స్ర్కీన్ ఉంటే సమస్యే ఉండదు. బి.జె.పి సెక్రటరీ మురళీధర్ రావు 50 నుంచి 150 మంది చూసేలా స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆతర్వాత ఈ విషయం గురించి రాజమౌళి, రమేష్ ప్రసాద్, శోభు లతో చర్చించాను. కేంద్ర ప్రభుత్వం తో ఈ విషయం గురించి చర్చించి ధియేటర్స్ సమస్యను పరిష్కరించడానికి క్రుషి చేయాలనుకుంటున్నాను.
రాజకీయంగా భవిష్యత్ ప్రణాళిక ఏమిటి..?
బి.జె.పి కి ఫుల్ టైమ్ వర్క్ చేస్తాను. రాష్ట విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ని 13 జిల్లాల్లోని ముఖ్య పట్టణాలకు వెళ్లి ప్రజలను కలిసాను. మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు బాధపడ్డాం. కానీ హైదరాబాద్ అభివ్రుద్ది చెందింది. ఇప్పుడు హైదరాబాద్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అంటే ఫీలింగ్ ఉంటుంది. కానీ..భవిష్యత్ లో విజయవాడ, వైజాగ్ అభివ్రుది చెందుతాయి. అందువలన బాధపడవలసిన అవసరం లేదని ప్రజలకు చెప్పాను. పార్టీ నాకు ఏది చెబితే అది చేస్తా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment
-
Contact at support@indiaglitz.com