భోజనానికి వస్తానని.. అంతలోనే : కైకాల మరణంపై కృష్ణంరాజు సతీమణి ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కృష్ణ, కృష్ణంరాజుల మరణాలతో తీవ్ర దిగ్భ్రాంతిలో వున్న టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్ధాల పాటు తన అసమాన నటనతో తెలుగువారిని అలరించిన కైకాల ఇక లేరన్న వార్తతో రెండు రాష్ట్రాల ప్రజలు విషాదంలో కూరుకుపోయారు. సత్యనారాయణ మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
భోజనానికి వస్తానని మాటిచ్చారు :
తాజాగా దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ..కైకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యనారాయణ కాలం చేశారని తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కైకాల భార్య, కుమార్తెలు మాతో క్లోజ్ ఫ్రెండ్స్‌లా వుంటారని.. మొన్నామధ్య సత్యనారాయణను మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని కృష్ణంరాజు కోరారని శ్యామలాదేవి గుర్తుచేసుకున్నారు. కానీ ఆయన తమ ఇంటికి రాలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల, కృష్ణంరాజులు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారని నటించారని శ్యామలాదేవి గుర్తుచేశారు. ముఖ్యంగా బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కామెడీ పాత్ర ఒప్పుకోవడం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. తన కోసమే కైకాల ఆ పాత్రలో నటించారని కృష్ణంరాజు అన్నారని శ్యామలాదేవి గుర్తుచేసుకున్నారు. ఒకే ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాలు ఒకరి తర్వాత ఒకరు దూరం కావడం తీరని లోటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ లో కన్నుమూసిన కృష్ణంరాజు :
కాగా... ఈ ఏడాది సెప్టెంబర్ 11న రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. విద్యాభ్యాసం తర్వాత సినిమాలపై ఆసక్తితో ‘చిలకా గోరింకా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా నటించి తన నటనతో మెప్పించారు. ఆయనకు రెండు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ , ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం వరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments