Krishnam Raju : తెలుగులో పైరసీకి బలైన తొలి హీరో కృష్ణంరాజే.. ఏ సినిమా, ఆ కథేంటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. కాలంతో పాటు ఇప్పుడిది తన వేషం మార్చుకుంది. గతంలో సినిమా రిలీజైన గంటల వ్యవధిలోనే పైరసీ సీడీలు ఆడియో, వీడియో షాపుల్లో హల్ చల్ చేసేవి. ఆ తర్వాత వెబ్సైట్ల రంగప్రవేశంతో సినిమాను వీడియో తీసి దానిని పోస్ట్ చేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వం , సినీ పరిశ్రమ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీ వెబ్సైట్లకు చెక్ పడటం లేదు. అయితే పైరసీలు తెలుగు చిత్ర పరిశ్రమను ఎప్పటి నుంచి వేధిస్తుందో తెలుసా. దానికి తొలిగా బలైన సినిమా, వ్యక్తి ఎవరో తెలుసా. ఇవాళ స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజే ఆ వ్యక్తి. దీనికి సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళితే..
మొఘల్ ఏ అజాం రేంజ్లో ప్లాన్ చేసిన కృష్ణంరాజు:
ఆయన హీరోగా నటించి, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ఆల్‌టైం క్లాసిక్‌లలో ఒకటైన తాండ్ర పాపారాయుడు టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా పైరసీకి గురైన సినిమాగా నిలిచింది . తాండ్ర పాపారాయుడిని కృష్ణంరాజు తన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించి నటించారు. ఈ సినిమాను ఆ రోజుల్లోనే భారీ స్థాయిలో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. పైరసీ వల్ల ఈ సినిమాకు కలెక్షన్లు పడిపోయాయి. అయితే సినిమా సూపర్‌హిట్ కావడంతో .. తనకు కలెక్షన్లు రాకపోయినప్పటికీ, పేరు రావడంతో కృష్ణంరాజు దాంతోనే సంతృప్తి పొందారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా విజయంతో మంచి జోష్‌లో వున్న రెబల్ స్టార్.. బాలీవుడ్ క్లాసిక్ మొఘల్ ఏ అజాం తరహాలో భారీ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే సాంఘిక చిత్రానికి బదులు చారిత్రాత్మక కథను ఎంచుకుంటే బాగుంటుందని భావించారాయన అదే తాండ్ర పాపారాయుడు కథ. ఈ మేరకు కొండవీటి వెంకట కవితో ఏడాది పాటు కథ తయారు చేయించి, తనతో కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన దాసరి నారాయణ రావును సంప్రదించారు కృష్ణంరాజు.
మూడు రాష్ట్రాల నుంచి గుర్రాలు, వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు :
దీనికి దర్శకరత్న ఆమోదం తెలపడంతో వెంటనే సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించిన రెబల్ స్టార్ పనులు మొదలుపెట్టారు. మోహన్ బాబు, జయప్రద, జయసుధ, సుమలత వంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌ను తీసుకున్నారు. చారిత్రక నేపథ్యం వున్న కథ కావడంతో రాజస్థాన్, ఒడిషా, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలను తెప్పించడంతో పాటు భారీ సెట్స్, వేలాది మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఆరు నెలల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసి రిలీజ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout