close
Choose your channels

నిన్న లతా మంగేష్కర్.. నేడు కృష్ణంరాజు..!

Thursday, November 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిన్న లతా మంగేష్కర్.. నేడు కృష్ణంరాజు..!

సినీ ఇండస్ట్రీ నుంచి వరుస షాకింగ్ న్యూస్‌లు వస్తున్నాయి. ఆ షాకింగ్ న్యూస్‌లతో వారి అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు!. ఇటీవలే మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్ న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. శ్వాస సంబంధిత సమస్య రావడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు వైద్యం అందిస్తున్నారు. అయితే ఇంకా ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఎడమ వెంట్రిక్యులర్‌ సమస్యతో పాటు నిమోనియా సమస్యే ఆమె అనారోగ్యానికి కారణంగా డాక్టర్లు చెబుతున్నారు.

కృష్ణం రాజుకు ఏమైంది!?
ఇదిలా ఉంటే.. ఒక్కరోజు గ్యాప్‌లోనే టాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం బుధవారం అర్ధరాత్రి రాత్రి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఏంటి పరిస్థితి..? అనేది ఇంతవరకూ తెలియరాలేదు.

కాగా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటీనటులు, సింగర్లు ఇలా వరుసగా వ్యాధుల భారీన పడి ఆస్పత్రిపాలవ్వడం గమనార్హం. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించకుండా వీలైనంత త్వరగా స్పందించి వ్యాధులను నయం చేసుకుంటే మంచిది. కాగా పైన చెప్పిన ఇద్దరూ లతా మంగేష్కర్, కృష్ణంరాజు ఇద్దరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని www.indiaglitz.com ఆకాంక్షిస్తోంది.

 
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment