ప్రభాస్ పెళ్లి వార్తలపై క్రిష్ణంరాజు కామెంట్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. బాహుబలి రిలీజైంది. కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం జరగలేదు. బాహుబలి 2 షూటింగ్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో బాహుబలి 2 షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రభాస్ పెళ్లి చేసుకోడు అనే విషయం స్పష్టం. అయితే ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై రెబల్ స్టార్ క్రిష్ణంరాజు స్పందిస్తూ...ప్రభాస్ పెళ్లి గురించి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రభాస్ పెళ్లి గురించి ఏ నిర్ణయం తీసుకున్నా..ముందుగా మీడియాకి తెలియచేస్తాం. ఇలా పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహాం వ్యక్తం చేసారు రెబల్ స్టార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments