ప్రభాస్ పెళ్లి వార్తలపై క్రిష్ణంరాజు కామెంట్...

  • IndiaGlitz, [Friday,November 13 2015]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్..పెళ్లి గురించి గ‌త కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత ఖ‌చ్చితంగా ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. బాహుబ‌లి రిలీజైంది. కానీ ప్ర‌భాస్ పెళ్లి మాత్రం జ‌ర‌గ‌లేదు. బాహుబ‌లి 2 షూటింగ్ డిసెంబ‌ర్ 14 నుంచి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో బాహుబ‌లి 2 షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి చేసుకోడు అనే విష‌యం స్ప‌ష్టం. అయితే ప్ర‌భాస్ పెళ్లి గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై రెబ‌ల్ స్టార్ క్రిష్ణంరాజు స్పందిస్తూ...ప్ర‌భాస్ పెళ్లి గురించి పుకార్లు ఎవ‌రు పుట్టిస్తున్నారో అర్ధం కావ‌డం లేదు. ప్ర‌భాస్ పెళ్లి గురించి ఏ నిర్ణ‌యం తీసుకున్నా..ముందుగా మీడియాకి తెలియ‌చేస్తాం. ఇలా పుకార్లు పుట్టించ‌డం క‌రెక్ట్ కాదంటూ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసారు రెబ‌ల్ స్టార్.