ప్రభాస్ మ్యారేజ్ డీటైల్స్ చెప్పిన కృష్ణంరాజు..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే...తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి వివరాలను రెబల్ స్టార్ కృష్ణంరాజు మీడియాకి తెలియచేసారు. తన పుట్టినరోజు సందర్భంగా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ...ఈ సంవత్సరంలో ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ ని పెళ్లి చేసుకోబేయే అమ్మాయి ఎవరు అనేది చెబుతాను.
బాహుబలి 2 తర్వాత చేసే సినిమా కంటే ముందుగానే ప్రభాస్ పెళ్లి ఉండచ్చు అని తెలియచేసారు. అంతే కాకుండా లైఫ్ లో ఎప్పుడు ఏం చేయాలో ప్రభాస్ కి తెలుసు అన్నారు. బాహుబలి 2 తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ప్రారంభం కంటే ముందే ప్రభాస్ పెళ్లి జరగడం ఖాయం అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com