కృష్ణ గాడి వీర ప్రేమ గాథ కథ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఇక కృష్ణ గాడి వీర ప్రేమ గాథ కథ విషయానికి వస్తే...ఈ సినిమాలో నాని బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్నారు. నాని ఈ సినిమాలో ప్రతి చిన్న విషయానికి భయపడే వాడిగా కనిపిస్తాడట.
అలాంటి భయస్తుడు అంగబలం, అర్థబలం ఉన్న కుటుంబంలోని అమ్మాయిని ప్రేమిస్తాడట. ఆ అమ్మాయి ప్రేమను గెలవడానికి ముగ్గురు పిల్లలతో ప్రయాణం ప్రారంభిస్తాడట నాని . ఆఖరికి భయస్తుడైన నాని ఎలా ప్రేమను గెలిచాడనేదే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ అని సమాచారం. నాని..భలే భలే మగాడివోయ్ సినిమాలో మతి మరుపు యువకుడుగా నటించి మెప్పించాడు . ఇప్పుడు భయస్థుడుగా కనిపించే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ తో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com