కృష్ణవంశీతో ముచ్చటగా మూడోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శక మేధావి కృష్ణవంశీ - అందాల తార రమ్యకృష్ణ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు చంద్రలేఖ, శ్రీ ఆంజనేయం. ఈ రెండు చిత్రాల తర్వాత ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కృష్ణవంశీ - రమ్యకృష్ణ కలసి ఓ సినిమా చేస్తున్నారు. అదే రుద్రాక్ష. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నిర్మాత దిల్ మాట్లాడుతూ...ఫస్ట్ టైం ఆడియోన్స్ కి విజువల్ ట్రీట్ అందించేలా రుద్రాక్ష మూవీ నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నాం అన్నారు. ఇక రమ్యకృష్ణ క్యారెక్టర్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు భక్తిరస చిత్రాల్లో అమ్మోరు గా నటించిన రమ్యకృష్ణ ఫస్ట్ టైం దెయ్యం గా నటిస్తుందని సమాచారం. ఈ దెయ్యం పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రమ్యకృష్ణ పాత్ర, గెటప్ ఉంటాయట. ఇదంతా వింటుంటే...బాహుబలి, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రమ్యకృష్ణ రుద్రాక్ష తో మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం అనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com