కృష్ణవంశీ కొత్త సినిమా నక్షత్రం ప్రారంభం
Wednesday, April 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొత్త సినిమా నక్షత్రం ఈరోజు ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరో సందీప్ కిషన్ పోలీస్ గా నటిస్తున్నారు. పోలీస్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కే ఈ చిత్రంలో ఊహించని ట్విస్ట్ లు, భారీ యాక్షన్స్ సీన్స్ ఉంటాయట. అవన్నీ రియలిస్టిక్ గా ఉండేలా వైవిధ్యంగా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభమైన సందర్భంగా హీరో సందీప్ కిషన్ ట్విట్టర్ లో స్పందిస్తూ...నా ఫేవరేట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారితో వర్క్ చేయడం గ్రేట్ గా ఫీలవుతున్నాను. ఈ మూవీ టైటిల్ నక్షత్రం. కృష్ణవంశీ గారితో సినిమా చేయాలనే నాకల నేడు నిజమైంది అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments