కృష్ణ‌వంశీ 'న‌ట‌సామ్రాట్‌`' ఎవ‌రో తెలుసా?

  • IndiaGlitz, [Monday,July 22 2019]

కృష్ణ‌వంశీ సినిమా 'అంతఃపురం'తో నిర్మాత‌గా మారారు న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌. 1999లో డ్యూయ‌ట్ మూవీస్ ప‌తాకంపై ప్ర‌కాష్‌రాజ్ తెర‌కెక్కించిన అంతఃపురం తెలుగులోనూ, త‌మిళ్‌లోనూ విడుద‌లైంది. ఆ సినిమా ఇప్ప‌టికీ అటు కృష్ణ‌వంశీ కెరీర్‌లోనూ, అటు ప్ర‌కాష్‌రాజ్ కెరీర్‌లోనూ క‌ల్ట్ సినిమాగా అయింది. మంచి మిత్రులుగా ఎన్నో ఏళ్లు కొన‌సాగిన వాళ్లు మ‌ధ్య‌లో మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత 'గోవిందుడు అంద‌రివాడేలే' సినిమాతో వారిద్ద‌రూ క‌లిశారు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆ సినిమాలో కృష్ణ‌వంశీది ప్ర‌ధాన పాత్ర‌.

ఇప్పుడు కృష్ణ‌వంశీ డౌన్ ఫాల్‌లో ఉన్నారు. స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో త‌ను ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఓ సినిమాను డ్యూయ‌ట్ మూవీస్ ప‌తాకంపై తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రాఠాలో నానా ప‌టేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'న‌ట సామ్రాట్‌'కు రీమేక్ అని వినికిడి. తెలుగులోనూ అదే పేరుతో చేస్తారా? తెలుగుకు త‌గ్గ‌ట్టు క‌థ‌లో మార్పులూ చేర్పులూ ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.

More News

కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే! - రైటర్ కమ్ హీరో ఆకాష్

కాన్సెప్ట్ పరంగా చాలా కొత్తగా ఉండి.. కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' మెయిన్ కాన్సెప్ట్ తనదే అంటున్నారు అందాల కథానాయకుడు, 'ఆనందం' ఫేమ్ ఆకాష్.

స‌మంత `96` లుక్ ఇదే...

స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న `96` తెలుగు రీమేక్ ఇమేజ్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్టులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

త‌మిళంలోకి తొలిసారి న‌టించ‌నున్న బాలీవుడ్ న‌టుడు

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుల్లో ప‌రేశ్ రావ‌ల్ ఒక‌రు. ఈయ‌న తెలుగులో శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి సినిమాతో పాటు మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు.

పూరి, చార్మితో గొడ‌వ‌పై రామ్ క్లారిటీ

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ హీరో పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`

త‌న‌ని తాను మ‌లుచుకుంటూ ఈ రేంజ్‌కు ఎదిగిన హీరో సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు.