కృష్ణవంశీ 'నటసామ్రాట్`' ఎవరో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణవంశీ సినిమా `అంతఃపురం`తో నిర్మాతగా మారారు నటుడు ప్రకాష్‌రాజ్. 1999లో డ్యూయట్ మూవీస్ పతాకంపై ప్రకాష్‌రాజ్ తెరకెక్కించిన అంతఃపురం తెలుగులోనూ, తమిళ్‌లోనూ విడుదలైంది. ఆ సినిమా ఇప్పటికీ అటు కృష్ణవంశీ కెరీర్‌లోనూ, అటు ప్రకాష్‌రాజ్ కెరీర్‌లోనూ కల్ట్ సినిమాగా అయింది. మంచి మిత్రులుగా ఎన్నో ఏళ్లు కొనసాగిన వాళ్లు మధ్యలో మనస్పర్థలతో దూరమయ్యారు. ఆ తర్వాత `గోవిందుడు అందరివాడేలే` సినిమాతో వారిద్దరూ కలిశారు. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఆ సినిమాలో కృష్ణవంశీది ప్రధాన పాత్ర.
ఇప్పుడు కృష్ణవంశీ డౌన్ ఫాల్‌లో ఉన్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తను ప్రధాన పాత్రధారిగా ఓ సినిమాను డ్యూయట్ మూవీస్ పతాకంపై తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరాఠాలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన `నట సామ్రాట్`కు రీమేక్ అని వినికిడి. తెలుగులోనూ అదే పేరుతో చేస్తారా? తెలుగుకు తగ్గట్టు కథలో మార్పులూ చేర్పులూ ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments