ఫిబ్రవరిలో కృష్ణవంశీ నక్షత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. ఈ 'నక్షత్రం' చిత్రానికి సంబంధించి తొలి పది ప్రచార చిత్రాలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే.
వాటికి ప్రేక్షక వర్గాలలో లభించిన ఆదరణ ఈ చిత్రం పై పరిశ్రమలోను, వ్యాపార వర్గాలలోనూ మరింత ఉత్సుకతను పెంచింది. ఈ సందర్భంగా మరోమారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కృతఙ్ఞతలు తెలిపారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలకు సంభందించి కీలక దృశ్యాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఫిబ్రవరి నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు నిర్మాతలు.
“పోలీస్” అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ “నక్షత్రం” రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత ను కలిగి ఉంటుందో.. సమాజం లో 'పోలీస్' పాత్ర అలాంటిది. అలాంటి పాత్రను ఈ 'నక్షత్రం' లో ఎలా చూపించబోతున్నామన్నది వెండితెరపైనే చూడాలన్నారు దర్శకుడు కృష్ణ వంశీ.
సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్, రెజీనా,ప్రగ్య జైస్వాల్,తులసి,జె.డి.చక్రవర్తి,ప్రకాష్ రాజ్,శివాజీరాజా, రఘుబాబు,తనీష్,ముఖ్తర్ ఖాన్,సాయికిరణ్, ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భారత్, పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెర:శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్: శివ.వై.ప్రసాద్, కొరియోగ్రఫీ: గణేష్,స్వామి; పోరాటాలు:జాషువా మాస్టర్,జాలి బాస్టియన్,శ్రీధర్; ఆర్ట్: పురుషోత్తం, పబ్లిసిటీ: ఓంకార్ కడియం, స్టిల్స్: మల్లిక్ నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్,సజ్జు,కె.శ్రీనివాసులు కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com