కృష్ణవంశీ మూవీ లేటెస్ట్ అప్ డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే..సినిమా తర్వాత ఇప్పటి వరకు తను ఏ సినిమా చేస్తున్నాడనేది ప్రకటించలేదు. అయితే కృష్ణవంశీ రుద్రాక్ష అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఊహించని విధంగా బాలయ్య వందో సినిమాకి డైరెక్టర్ ఇతనే అంటూ కృష్ణవంశీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది. ఆతర్వాత ఏమైందో ఏమో...కానీ బాలయ్య వందో సినిమాని క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కృష్ణవంశీ యువ హీరో సందీప్ కిషన్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. పోలీస్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కే ఈ చిత్రంలో ఊహించని ట్విస్ట్ లు, భారీ యాక్షన్స్ సీన్స్ ఉంటాయట. అవన్నీ రియలిస్టిక్ గా ఉండేలా చిత్రీకరించనున్నారట.ఈ చిత్రాన్నికృష్ణవంశీ స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్నట్టు సమాచారం. ఈనెల 27 నుంచి షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న కుదరకపోతే దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com