మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్న కృష్ణవంశీ
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ...లేడీ ఓరియెంట్ మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రుద్రాక్ష అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే...ఇప్పటికే అందాల తార అనుష్క ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు, ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారట.
అయితే... కృష్ణవంశీ, దిల్ రాజు హీరోయిన్ సమంత ను సంప్రదించి కథ చెప్పారట. కథ విని సమంత ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. గ్రాఫికల్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. గోవిందుడు అందరివాడేలే... తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న రుద్రాక్ష తో కృష్ణవంశీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments